హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): గిడ్డంగుల లీజులో హైదరాబాద్ అత్యధిక వృద్ధిని నమోదు చేసుకున్నది. ఈ ఏప్రిల్-సెప్టెంబర్‌లో 27 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం లీజింగ్ జరిగినట్టు తాజాగా నైట్‌ఫ్రాంక్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 8 మెట్రో నగరాల్లో తీసుకున్న గిడ్డంగులపై ప్రత్యేక నివేదికను సోమవారం విడుదల చేసింది. పుణెలో 42 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకోగా.. ఆ తర్వాత ముంబైలో 36 లక్షలు, బెంగళూరులో 32 లక్షల చదరపు అడుగుల మేర లీజులు జరిగాయి. 27 లక్షలతో ఆ తర్వాతి స్థానంలో హైదరాబాద్ నిలిచింది. ఇక ఢిల్లీ-ఎన్సీఆర్లో 26 లక్షల చదరపు అడుగులు, చెన్నైలో 24 లక్షలు, అహ్మదాబాద్‌లో 21 లక్షలు, కోల్‌కతాలో 18 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో లావాదేవీలు జరిగినట్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా 12 శాతం వేర్ హౌసింగ్ మార్కెట్ వృద్ధిని నమోదు చేసుకోగా, అందులో హైదరాబాద్‌లో 2 శాతం, పుణె, చెన్నైలలో 4 శాతం, అహ్మదాబాద్‌లో 3 శాతం, కోల్‌కతాలో 2 శాతం, మిగిలిన మెట్రో నగరాల్లో 1 శాతం పెరిగాయి.