1991లాగే 2026
ప్రస్తుత ఏడాది 2026.. 1991లాగే ఉంటుందని ముఖ్య ఆర్థిక సలహాదారు వీ అనంత నాగేశ్వరన్ ఒక్కసారిగా బాంబు పేల్చారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ సంవత్సరాన్ని కీలక మలుపుగానే పరిగణించవచ్చని వ్యాఖ్యానించారు. అయితే ఆ వెంటనే 1991 అంటే.. ఆర్థిక సంక్షోభం కాదని అనడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. గురువారం ఐఎస్ఐడీ-ఐడీఆర్‌ఏ జాతీయ సదస్సునుద్దేశించి ఆయన మాట్లాడారు.
- దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకం కాగలదు
- సీఈఏ అనంత నాగేశ్వరన్
న్యూఢిల్లీ, అక్టోబర్ 29: ప్రస్తుత ఏడాది 2026.. 1991లాగే ఉంటుందని ముఖ్య ఆర్థిక సలహాదారు వీ అనంత నాగేశ్వరన్ ఒక్కసారిగా బాంబు పేల్చారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ సంవత్సరాన్ని కీలక మలుపుగానే పరిగణించవచ్చని వ్యాఖ్యానించారు. అయితే ఆ వెంటనే 1991 అంటే.. ఆర్థిక సంక్షోభం కాదని అనడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. గురువారం ఐఎస్ఐడీ-ఐడీఆర్‌ఏ జాతీయ సదస్సునుద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అంతర్జాతీయంగా సవాళ్లేగాక.. తయారీ, ఎనర్జీ, వ్యవసాయ, టెక్నాలజీ రంగాల్లో భారత్‌కు నిర్మాణాత్మక అడ్డంకులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే ‘2026.. 1991ని పోలి ఉంటుంది.
మీరంతా వెంటనే అప్పటి ఆర్థిక సంక్షోభం మళ్లీ సంభవిస్తుందా? అనుకోకండి’ అన్నారు. 1991లో దేశంలో విదేశీ మారకపు నిల్వలు అడుగంటిపోయి కనీస చెల్లింపులు కూడా చేయలేని దుస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. దీంతో అనేక సాహసోపేత సంస్కరణలు చేపట్టారు. ఇవి ఆ తర్వాత కాలంలో భారత ఆర్థిక ముఖచిత్రాన్నే మార్చేశాయి. అలాగే ఈ ఏడాదీ జరుగవచ్చన్న అభిప్రాయాన్ని నాగేశ్వరన్ వెలిబుచ్చారు. నిజానికి స్థూల ఆర్థిక స్థిరత్వం, స్థితిస్థాపకతల్లో భారత్‌ను ఓ ఆశాకిరణంగా అంతర్జాతీయ సమాజం అభివర్ణిస్తున్నదని ఆయన గుర్తుచేశారు. అయినప్పటికీ కొన్నిసార్లు దీన్ని మరచి సోషల్ మీడియాలో అనవసరపు కథనాలను వండివార్చుతున్నారని ఒకింత అసహనం వ్యక్తం చేశారు.
ఈ దిశగా దృష్టి పెట్టాలి
ప్రభుత్వాలు, పరిశ్రమలు దేశీయ సామర్థ్యాల బలోపేతంపై దృష్టి పెట్టాలని నాగేశ్వరన్ సూచించారు. భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల సమయాల్లో భారంగా మారే దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని కూడా హితవు పలికారు. ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పోటీలో ఈ 21వ శతాబ్దం కీలకమన్న ఆయన.. తమ అవసరాలను తీర్చుకోవడానికి ఏ దేశం ఎంతమేరకు తమ పరపతిని ఉపయోగించుకోగలదన్నదే ప్రధాన ప్రశ్న అన్నారు. నిజానికి ఇప్పుడున్న దారుణ పరిస్థితులు చేజేతులా తెచ్చుకున్నవేనని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఇటీవల భారత్‌కు అవసరమైన టన్నెల్ బోరింగ్ మెషీన్లు, మరెన్నో ఇతర మౌలిక వస్తూత్పత్తుల కోసం ఓ ఎగుమతి లైసెన్సింగ్ విధానాన్ని చైనా ప్రకటించిందని గుర్తుచేశారు. అయితే ఇతర దేశాలకు అవసరమైన కీలక ఎగుమతుల్నే చాలా దేశాలు తమ ఆయుధాలుగా వాడుతున్నాయన్న ఆయన.. దీనివల్ల అప్పటికైతే ప్రభావం ఉన్నా.. అది ఎంతోకాలం సాగదని చెప్పారు. ఇది జరుగాలంటే ఆయా ఎగుమతులపై ఆధారపడకుండా స్వదేశంలోనే ఉత్పత్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఇకపై ఒక లెక్క..
కరోనాకు ముందు 40 ఏండ్లు ఒక లెక్క.. ఆ తర్వాత 20-30 ఏండ్లు ఒక లెక్క అని నాగేశ్వరన్ అన్నారు. గతంలో ఎదురైన చాలా దెబ్బలు ఎక్కువగా డిమాండ్ కొరతకు సంబంధించినవేనని చెప్పారు. కాబట్టి 1987లో వచ్చిన స్టాక్ మార్కెట్ క్రాష్, 1990-91లో ఎదురైన పొదుపు-రుణ సంక్షోభం కావచ్చు.. 1997-98 తూర్పు ఆసియా సంక్షోభం, 2001 ఐటీ సంక్షోభం, 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కావచ్చు.. దేని నుంచైనా సెంట్రల్ బ్యాంకుల ద్రవ్య విధానం, ఉద్దీపనలతోనే బయటపడటానికి ప్రయత్నించవచ్చన్నారు. ఇక పెరుగుతున్న కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం.. డాటా సెంటర్ల ఏర్పాటు కోసం మూలధనం, నీటి వనరులు, విద్యుత్తును భారీ ఎత్తున ఖర్చు చేయిస్తున్నదన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

