Hyundai i20 Facelift | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా.. (Hyundai Motor India) దేశీయ మార్కెట్లోకి ప్రీమియం హ్యాచ్ బ్యాక్ మోడల్ రీఫ్రెష్డ్ ఐ-20 ఫేస్‌లిఫ్ట్ (Hyundai i20 Facelift) ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.6.99 లక్షల (ఎక్స్ షోరూమ్ ధర) నుంచి ప్రారంభం అవుతుంది. టాప్ హై ఎండ్ మోడల్ ధర రూ.11.01 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. పాత మోడల్ కారులో టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్‌ను ఉపసంహరిస్తున్నట్లు తెలిపింది. మూడేండ్లు లేదా లక్ష కి.మీ వరకు వారంటీ పొడిగిస్తున్టన్లు వెల్లడించింది.
హ్యుండాయ్ ఐ20 ఫేస్ లిఫ్ట్‌లో ఆరు ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ డిస్ట్రిబ్యూషన్ వంటి సేఫ్టీ ఫీచర్లు అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా జత చేశారు.
డ్యుయల్ టోన్ గ్రే, బ్లాక్ కలర్ సిస్టమ్, యాంబియెంట్ లైటింగ్, బోస్ సౌండ్ సిస్టమ్, రీ డిజైన్డ్ కీ, సెమీ లెథరెట్టే సీట్స్, లెదరట్టే డూర్ ఆర్మ్ రెస్ట్స్, లెదర్ రాప్డ్ డీ-కట్ స్టీరింగ్ వీల్ ఉంటాయి.
నాచురల్ సౌండ్స్ ఆఫర్ చేస్తున్న అప్ గ్రేడెడ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్తోపాటు 60కి పైగా కనెక్టెడ్ కార్ ఫంక్షన్స్, 127 ఎంబీడెడ్ వీఆర్ కమాండ్స్, 52 హింగ్లిష్ వాయిస్ కమాండ్స్, ఓవర్ దీ ఎయిర్ అప్ డేట్స్, మల్టీలింగువల్ సపోర్ట్, టైప్ సీ చార్జర్ ఫీచర్లు ఉన్నాయి.
హ్యుండాయ్ ఐ20 ఫేస్ లిఫ్ట్ కారు 1.2 లీటర్ల నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లో గరిష్టంగా 82 బీహెచ్పీ, ఐవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ వేరియంట్ 86 బీహెచ్పీ విద్యుత్ వెలువరిస్తాయి. ఈ ఇంజిన్‌లో ఇప్పుడు కొత్తగా ఐడిల్ స్టాప్ అండ్ గో (ఐఎస్జీ) ఫీచర్ జత చేశారు. ఇంకా ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ విత్ ఎల్ఈడీ డే టైం రన్నింగ్ ల్యాంప్స్, న్యూలీ డిజైన్డ్ 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ తో వస్తున్నది.