న్యూఢిల్లీ, జనవరి 12: దేశీయ మార్కెట్లోకి సరికొత్త సీబీ300 ఆర్ మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా. ఢిల్లీ షోరూంలో ఈబైకు రూ.2.77 లక్షలకు లభించనున్నది. ఈ బైకు కోసం దేశవ్యాప్తంగా ఉన్న బిగ్‌వింగ్, బిగ్‌వింగ్ డీలర్ల వద్ద బుధవారం నుంచి ముందస్తు బుకింగ్‌లు చేసుకోవచ్చునని సంస్థ సూచించింది. 286 సీసీ కెపాసిటీ కలిగిన ఈ బైకు యువతను దృష్టిలో పెట్టుకొని తయారు చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.