విపణిలోకి రేంజ్ రోవర్ 2021 ఎవోక్యూ.. రూ.64.12 లక్షల నుంచి షురూ!
విపణిలోకి రేంజ్ రోవర్ 2021 ఎవోక్యూ.. రూ.64.12 లక్షల నుంచి షురూ!| విపణిలోకి జాగ్వార్ లాండ్ రోవర్ అప్డేటెడ్ ఎవోక్యూ మోడల్ కారును ఆవిష్కరి.......

న్యూఢిల్లీ: టాటా మోటార్స్ అనుబంధ జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) విపణిలోకి న్యూ రేంజ్ రోవర్ ఎవోక్యూను మంగళవారం దేశీయ విపణిలో ఆవిష్కరించింది. ఈ మోడల్ కార్ల ధరలు రూ.64.12 లక్షల నుంచి మొదలవుతాయి. పాత మోడల్ ఎవోక్యూతో పోలిస్తే అప్డేటెడ్ ఎస్యూవీ ఎవోక్యూ కారు ధర రూ.5.08 లక్షలు ఎక్కువ. పాత మోడల్ ఎవోక్యూ కారు ధర రూ.59.04 లక్షలుగా ఉంది. ఎవోక్యూ కార్లపై ఆసక్తి గల కొనుగోలుదారులు ఆన్లైన్లో బుకింగ్ నమోదు చేసుకోవచ్చు.
పలు వేరియంట్లలో ఎవోక్యూ లభ్యం
జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) న్యూ ఎవోక్యూ మోడల్ కారు ఎస్, ఆర్-డైనమిక్ ఎస్ఈ ట్రిమ్స్ వేరియంట్లలో లభ్యం కానున్నది. ఎవోక్యూ ఎస్ మోడల్ కారు 2.0 లీటర్ల డీజిల్ ఇంజిన్‌తో 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సౌకర్యం కలిగి ఉంటుంది. గరిష్ఠంగా 204 పీఎస్, 430 ఎన్ఎం టార్చి లభిస్తుంది. ఎవోక్యూ ఆర్-డైనమిక్ ఎస్ఈ మోడల్ కారు 2.0 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సామర్థ్యంతో రూపుదిద్దారు. ఇది గరిష్ఠంగా 250 పీఎస్ విద్యుత్, 365 ఎన్ఎం టార్చిని వెలువరిస్తుంది.
7.6 సెకన్ల నుంచి 8.5 సెకన్లలోనే 100 కిమీ స్పీడ్
ఎవోక్యూ డీజిల్ వేరియంట్ కారు 8.5 సెకన్లలోనూ 100 కి.మీ. స్పీడ్ అందుకుంటుంది. గంటకు ఈ మోడల్ కారు గరిష్ఠ వేగం 213 కిలోమీటర్లు. ఇక ఎవోక్యూ ఆర్ డైనమిక్ ఎస్ఈ పెట్రోల్ వేరియంట్ 7.60 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ఠంగా 221 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.
అప్డేటెడ్ ఎవోక్యూలో ఫీచర్లు ఇవీ..
2021 రేంజ్ రోవర్ ఎవోక్యూలో పీవీ ప్రో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 3డీ సరౌండ్ కెమెరా, ఫోన్ సిగ్నల్ బూస్టర్తోపాటు వైర్లెస్ డివైజ్ చార్జర్, పీఎం 2.5 ఫిట్టర్‌తో క్యాబిన్ ఎయిర్ ఐయానిజేషన్ తదితర ఫీచర్లు జత కలిశాయి. అప్డేటెడ్ ఎస్‌యూవీలో న్యూ డీజ్ గార్నెట్, ఎబోనీ డ్యూయల్ టోన్ ఇంటీరియర్ థీమ్ ఫీచర్లు జోడించారు.
లాండ్ రోవర్ ఇండియా ప్రొడక్ట్స్‌లో నూతనంగా న్యూ రేంజ్ రోవర్ ఎవోక్యూ, డిస్కవరీ స్పోర్ట్, న్యూ రేంజ్ రోవర్ వెలార్, డిఫెండర్ 110, రేంజ్ రోవర్ స్పోర్ట్ మోడల్ కార్లు విపణిలోకి ప్రవేశించాయి.
రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ మోడల్ కార్ల ధరలు ఒకసారి చూద్దామా.
- న్యూ రేంజ్ రోవర్ ఎవోక్యూ – రూ. 64.12 లక్షలు
- డిస్కవరీ స్పోర్ట్ – రూ. 65.30 లక్షలు
- న్యూ రేంజ్ రోవర్ వేలార్ – రూ. 79.87 లక్షలు
- డిఫెండర్ 110 – రూ. 83.38 లక్షలు
- రేంజ్ రోవర్ స్పోర్ట్ – రూ. 91.27 లక్షలు
- రేంజ్ రోవర్ – రూ. 2.11 కోట్లు
- రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్వీఆర్ – రూ. 2.19 కోట్లు
ఇవి కూడా చదవండి:
బిగ్ బాస్ 5 తెలుగులో ఆలీ ఎంట్రీ.. నిజమెంత?
కర్నాటకం : యడియూరప్పపై టూరిజం మంత్రి తిరుగుబాటు
వరుడికి కట్నంగా ఆక్సిజన్..!
ప్రపంచంలోనే ఎత్తయిన గుర్రం బిగ్ జాక్ ఇకలేదు..!
విస్తారా ఎయిర్‌లైన్స్ బంపర్ ఆఫర్
రెనాల్ట్ కార్లపై అద్భుతమైన ఆఫర్లు… భారీ డిస్కౌంట్స్…
ఇన్ కమ్ టాక్స్ ఫైల్ చేయడానికి సడలింపులు..
ఏడాదిలో మూడోసారి : టాటా కార్ల ధరలకు రెక్కలు!
రూ.15 లక్షల కోట్లు.. ప్రపంచ కుబేరుల్లో ఇంకా టాప్‌లోనే బెజోస్
ఆంక్షలపై తగ్గేందుకు సౌదీ ససేమిరా.. సంక్షోభం ముంగిట ఓపెక్?
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

