న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: గోల్డ్ ఈటీఎఫ్‌ల కంటే ఈక్విటీ మార్కెట్లు అధిక రాబడిని ఇస్తుండటంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను అటువైపు తరలిస్తున్నారు. జనవరి నెలలో గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి రూ.199 కోట్ల విలువైన పెట్టుబడులు ఈక్విటీల్లోకి మళ్లించారు. వరుసగా మూడు నెలలో ఇలా నిధులను తరలించుకోవడం విశేషం. నవంబర్‌లో రూ.195 కోట్లను ఉపసంహరించుకున్న పెట్టుబడిదారులు..డిసెంబర్‌లోనూ రూ.273 కోట్లను వెనక్కితీసుకున్నారు. కానీ, అక్టోబర్‌లో మాత్రం రూ.147 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు యాంఫీ వెల్లడించింది. ఈక్విటీ, మ్యూచువల్ఫండ్ మార్కెట్లు భారీ గా లాభపడుతుండటంతోపాటు బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.