హైదరాబాద్, సెప్టెంబర్ 15: ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ.. కార్పొరేట్, హెల్త్, ఆటో ఇన్సూరెన్స్ మార్కెట్లలో 14 కొత్త బీమా పత్రాల్ని విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న ఇన్సూరెన్స్ పాలసీలను అప్గ్రేడ్ చేసి కొత్తగా జారీచేసినట్టు సంస్థ ఈడీ సంజీవ్ మంత్రి తెలిపారు. హాస్పిటలైజేషన్కు ముందు, తర్వాత వ్యయాల్ని కవర్ చేసే హెల్త్ అడ్వాంటేజ్, అన్ని మోటార్ పాలసీలకు సింగిల్ ప్రీమియం, సింగిల్ రెన్యువల్ తేదీతో సింగిల్ పాలసీ మోటార్ ఫ్లోటర్ ఇన్సూరెన్స్ తాజాగా విడుదల చేసిన బీమా పత్రాల్లో ఉన్నాయి. డ్రైవింగ్ అలవాట్లకు తగినట్లుగా యాడ్ అన్ కవరేజ్ అందించే ‘పే-హౌ-యూ-యూజ్ పాలసీ’ పేరుతో ఒకటి, ట్రావెలర్స్ అభిరుచులకు అనుగుణమైన వొయేజర్ ట్రావెల్ ఇన్సూరెన్స్ మరొక కొత్త పాలసీని ఐసీఐసీఐ లాంబార్డ్ తీసుకొచ్చింది.