Rider Supermax | నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ కంపెనీ జీమొపాయ్.. దేశీయ మార్కెట్లోకి న్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ రైడర్ సూపర్మాక్స్ తీసుకొచ్చింది. ఇది ఆరు కలర్ ఆప్షన్లు – జాజీ నియాన్, ఎలక్ట్రిక్ బ్లూ, బ్లేజింగ్ రెడ్, స్పార్క్లింగ్ వైట్, గ్రాఫైట్ గ్రే, ఫ్లోరెసెంట్ ఎల్లో రంగుల్లో లభిస్తుంది. యాంటీ థెఫ్ట్ అలారం, లైవ్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు జత చేశారు. దీని ధర రూ.79,999గా నిర్ణయించారు.
రైడర్ సూపర్ మాక్స్ ఈ-స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారు కంపెనీ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి రూ.2,999 పే చేసి ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. మార్చి 10 నుంచి కంపెనీ షోరూమ్‌ల్లో సేల్స్ ప్రారంభం అవుతాయి. జిమోపాయి కో-ఫౌండర్, ఎండీ అమిత్‌రాజ్ సింగ్ మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీతో గ్రేట్ రైడింగ్ క్వాలిటీతో ఎలక్ట్రిక్ స్కూటర్ రైడర్ సూపర్మాక్స్ను మార్కెట్లోకి తీసుకొచ్చినందుకు థ్రిల్లింగ్‌గా ఉందన్నారు.
బీఎల్డీసీ హబ్ మోటార్ గరిష్టంగా 2.7 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం
గంటకు 60 కి.మీ. వేగంతో ప్రయాణం.
1.8 కిలోవాట్ల పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ అండ్ చార్జర్‌తో రైడర్ సూపర్మాక్స్ లభ్యం.
ఒకసారి చార్జింగ్ చేస్తే 100 కి.మీ. వరకు ప్రయాణం చేయొచ్చు.
జిమోపాయి కనెక్ట్ యాప్‌తో స్మార్ట్ ఫోన్‌కు కనెక్ట్ చేయొచ్చు.
జిమోపాయి కనెక్ట్ యాప్‌తో స్కూటర్ బ్యాటరీ రియల్‌టైం మానిటరింగ్, స్పీడ్ అలర్ట్స్, సర్వీస్ రిమైండర్స్ జారీ.
డిస్క్ బ్రేక్ @ ఫ్రంట్, డ్రమ్ బ్రేక్ @రేర్.