మంగళవారం 31 మార్చి 2020
Business - Feb 04, 2020 , 00:05:47

రెండేండ్లలో 100 కోట్ల టర్నోవర్‌

రెండేండ్లలో 100 కోట్ల టర్నోవర్‌
  • హనీ గ్రూపు సీఎండీ ఓబుల్‌ రెడ్డి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3: తెలుగు రాష్ర్టాల్లో ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థల్లో ఒకటైన హనీ గ్రూపు వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. వచ్చే మూడు నెలల్లో పది నూతన ప్రాజెక్టులను ప్రకటించడంతోపాటు వచ్చే రెండేండ్లలో రూ.100 కోట్ల టర్నోవర్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్లు హనీ గ్రూపు సీఎండీ ఓబుల్‌ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం సంస్థ టర్నోవర్‌ రూ.10 కోట్లుగా ఉన్నది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అన్ని రకాల సేవలు అందించడానికి కన్సల్టింగ్‌ సేవలును సైతం అందిస్తున్న సంస్థ..ఈ విభాగంలో ప్రస్తుతం 500 మంది ఉద్యోగులు ఉండగా, వచ్చే రెండేండ్లలో ఈ సంఖ్యను 2 వేలకు పెంచుకోనున్నట్లు ప్రకటించారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలో 16 శాఖలతో సేవలు కన్సల్టింగ్‌ సేవలు అందిస్తున్న సంస్థ..వచ్చే మూడు నెలల్లో మరో ఏడు శాఖలను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఆస్తుల కొనుగోలుకు సంబంధించి అన్ని రకాల సేవలు ఒక్కచోట అందించాలనే ఉద్దేశంతో రెండేండ్ల క్రితం ఈ గ్రూపును ప్రారంభించినట్లు, ఇది వరకు 21 ప్రాజెక్టులకు సంబంధించిన గృహాలను విక్రయించినట్లు చెప్పారు.   
logo
>>>>>>