Toyota Year End Offers | మరో 45 రోజుల్లో 2024 కాలగర్భంలో కలిసిపోవడంతోపాటు 2025 సంవత్సరం ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా (Toyota) కార్ల కొనుగోలుదారులకు ఇయర్ ఇండ్ ఆఫర్లు అందిస్తోంది. ఈ మేరకు గ్లాన్జా (Glanza), అర్బన్ క్రూయిజర్ (Urban Cruiser), టైసర్ (Taisor), అర్బన్ క్రూయిజర్ హై రైడర్ (Urban Cruiser Hyryder) స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ కార్లు ఆవిష్కరించింది. స్పెషల్ ఎడిషన్ కార్లను ఆవిష్కరించడంతోపాటు వాటిపై ఎక్స్క్లూజివ్ ఇయర్ ఎండ్ ఆఫర్లు అందిస్తోంది టయోటా. ఈ ఇయర్ ఎండ్ ఆఫర్లు వచ్చేనెలాఖరు వరకూ కంపెనీ డీలర్ల వద్ద అందుబాటులో ఉంటాయి. గరిష్టంగా రూ.లక్ష వరకూ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి.
టయోటా గ్లాన్జా అన్ని మోడల్ కార్లపై రూ.17,381 రాయితీ అందిస్తున్నది. వీటితోపాటు 9టీజీఏ యాక్సెసరీస్, 3డీ ఫ్లోర్ మ్యాట్స్, ప్రీమియం డోర్ విజర్స్, లోయర్ గ్రిల్ గార్నిష్, ఓఆర్వీఎం గార్నిష్ క్రోమ్, రేర్ ల్యాంప్ గార్నిష్ క్రోమ్, ఫ్రంట్ బంపర్ గార్నిష్, ఫెండర్ గార్నిష్ క్రోమ్, బంపర్ కార్నర్ ప్రొటెక్టర్, రేర్ బంపర్ గార్నిష్ క్రోమ్ వంటి విడి భాగాలు అందిస్తోంది.
టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ మీద రూ.17,931 లతో కూడిన ప్యాకేజీ అందిస్తున్నది. ఈ, ఎస్, ఎస్+ (పెట్రోల్ వేరియంట్ల)కు ఈ ప్యాకేజీ ఉంటుంది. ఇందులో 9టీజీఏ యాక్సెసరీస్, ఆల్ వెదర్ 3డీ మ్యాట్స్, హెడ్ ల్యాంప్ గార్నిష్, ఫ్రంట్ గ్రిల్లె గార్నిష్, బాడీ కవర్, ఇల్యూమినేటెడ్ డోర్ సిల్ గార్డ్, రేర్ బంపర్ కార్నర్ గార్నిష్ (బ్లాక్ గ్లాస్ అండ్ రెడ్), రూఫ్ ఎండ్ స్పాయిలర్ ఎక్స్టెండర్ (బ్లాక్ గ్లాస్ అండ్ రేర్), ఫ్రంట్ బంపర్ గార్నిష్ (బ్లాక్ గ్లాస్ అండ్ రెడ్) వంటి యాక్సెసరీలు లభిస్తాయి.
టయోటా అర్బన్ క్రూయిజర్ హై రైడర్ మోడల్ కారుపై రూ.50,817 విలువైన ప్యాకేజీ ఉంటుంది. నియో డ్రైవ్ – ఎస్, జీ, వీ, హైబ్రీడ్ – జీ అండ్ వీ వేరియంట్లకు ఈ ప్యాకేజీ వర్తిస్తుంది. ఈ ప్యాకేజీ కింద 13 టీజీఏ యాక్సెసరీస్, మడ్ ఫ్లాప్, డోర్ విజన్ ప్రీమియం, ఆల్ వెదర్ 3డీ ఫ్లోర్ మ్యాట్స్, ఫ్రంట్ బంపర్ గార్నిష్, రేర్ బంపర్ గార్నిష్, హెడ్ ల్యాంప్ గార్నిష్, హుడ్ ఎంబ్లం, బాడీ క్లాడింగ్, ఫెండర్ గార్నిష్, రేర్ డోర్ లిడ్ గార్నిష్, లెగ్ రూమ్ ల్యాంప్, డిజిటల్ వీడియో రికార్డర్, డోర్ క్రోమ్ హ్యాండిల్ వంటి విడి భాగాలు ఉంటాయి.