హైదరాబాద్ నైపర్కు జాతీయ హోదా

- బిల్లుకు పార్లమెంటు ఆమోదం
న్యూఢిల్లీ, డిసెంబర్ 9: హైదరాబాద్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ (నైపర్)కు జాతీయ హోదా లభించింది. హైదరాబాద్ నైపర్తో పాటు దేశంలోని మరో ఐదు ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ సంస్థలకు జాతీయ ప్రాధాన్యతను కల్పించే బిల్లును గురువారం రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లుకు డిసెంబర్ 6 లోక్సభ ఆమోదముద్ర వేసింది. బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చకు ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా బదులిస్తూ నైపర్లకు జాతీయ ప్రాధాన్యతనివ్వడంతో సహా నాలుగు సవరణలతో బిల్లు రూపొందించామన్నారు. ఇప్పటివరకూ మొహలీ నైపర్కే జాతీయ హోదా ఉందని, ఆ తర్వాత ఏర్పాటైన మిగతా ఆరు నైపర్లకు జాతీయ ప్రాధాన్యత ఉన్నదో లేదోనన్న సందిగ్దతను తొలగించేక్రమంలో వీటికి హోదా కల్పిస్తూ ఒక సవరణ చేసామని వివరించారు. తాజాగా జాతీయ ప్రాధాన్యతా గుర్తింపు లభించిన నైపర్లు హైదరాబాద్, అహ్మదాబాద్, గువహటి, హాజీపూర్, కొల్కతా, రాయబరెలీల్లో ఉన్నాయి. ఇవి అండర్గ్రాడ్యుయేట్, డిప్లొమో కోర్సుల్ని ప్రారంభిస్తాయి. వీటికి అడ్వయిజరీ కౌన్సిల్ను నియమిస్తారు. అలాగే ఈ సంస్ధల నిర్వహణను చూసే బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యుల సంఖ్యను 23 నుంచి 12కు తగ్గిస్తారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Techie Stabbed To Death | టెక్కీని కత్తితో పొడిచి హత్య.. సహజీవనం చేస్తున్న మహిళ, ఆమె తల్లి అరెస్ట్
Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

