జోరుగా.. హుషారుగా..
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ, టెలికం, ఐటీ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో మరో నూతన శిఖరానికి చేరుకున్నాయి.
- రికార్డు స్థాయికి చేరుకున్న సూచీలు
ముంబై, జూలై 16: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ, టెలికం, ఐటీ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో మరో నూతన శిఖరానికి చేరుకున్నాయి. ఇంట్రాడేలో 233 పాయింట్లు పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 51.69 పాయింట్లు అందుకొని 80,716.55 వద్ద ముగిసింది.
మరో సూచీ నిఫ్టీ సైతం 26.30 పాయింట్లు ఎగబాకి రికార్డు స్థాయి 24,613 వద్ద ముగిసింది. రికార్డు స్థాయికి చేరుకున్న సూచీలకు రిలయన్స్, కొటక్ బ్యాంక్ షేర్లు పతనమవడం భారీ లాభాలను నియంత్రించగలిగాయి. ఈ నెల చివర్లో ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు ఉన్నట్లు వచ్చిన సంకేతాలతో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఈక్విటీల్లోకి భారీగా నిధులు కుమ్మరించారు. అలాగే బ్లూచిప్ సంస్థల ఆశాజనక ఆర్థిక ఫలితాలు మార్కెట్లకు ఉత్సాహాన్నినింపాయి.
మరోవైపు, మార్కెట్లో హెచ్‌యూఎల్ 2.7 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ లాభాల్లో ముగిశాయి. మరోవైపు, కొటక్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్‌గ్రిడ్ షేర్లు నష్టల్లోకి జారుకున్నాయి. రంగాలవారీగా చూస్తే రియాల్టీ, ఎఫ్ఎంసీజీ, టెలికమ్యూనికేషన్, టెక్నాలజీ, ఐటీ రంగ షేర్లు రెండు శాతం వరకు లాభపడ్డాయి. ఆర్థిక సేవలు, యుటిలిటీ, బ్యాంకింగ్, క్యాపిటల్ రంగ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
నేడు మార్కెట్లకు సెలవు
మొహర్రం సందర్భంగా బుధవారం స్టాక్ మార్కెట్లు సెలవుపాటించనున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

