యూత్ మెచ్చిన టూ ఇన్ వన్ నెయిల్ పాలిష్.. ఎందుకంత క్రేజ్ !!
Nail Polish | ఒక రంగును ఎంచుకుని అన్ని వేళ్లకూ ఆ వర్ణాన్నే వేసుకోవడం అన్నది పాత ముచ్చట. కనీసం రెండు రంగులకలయికగా నెయిల్ పాలిష్ పెట్టుకోవడం, వాటి కాంబినేషన్లోనే రకరకాల డిజైన్లతో నెయిల్ ఆర్ట్ వేసుకోవడం అన్నది సరికొత్త సంగతి. అలా గోళ్లకు జంట రంగులు వేసుకోవడానికి ఏ రెండు వర్ణాల జోడీ బాగుంటుందా అని మనం బుర్ర చించుకుని ఆలోచించనక్కర లేకుండా తయారీ సంస్థలే టూ ఇన్ వన్ నెయిల్ పాలిష్‌లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి.

చూసినవారు, భలే మంచి కాంబినేషనే అనుకునేలా రకరకాల వర్ణాల మేళవింపుగా తయారు చేస్తున్నాయి. గులాబీరంగుకు లేత ఊదా, ఆకుపచ్చకు బచ్చలపండు రంగు, చాక్లెట్ రంగుకు మట్టి ఎరుపు… ఇలా ఒకే ప్యాక్‌ను రెండు రంగుల కలబోతగా రూపొందిస్తున్నారు. చమ్కీలతో మెరిసే గ్లిట్టర్ నెయిల్ పాలిష్‌లను వివిధ రంగులతో కలిపి వాడటం కొందరికి ఇష్టం. అలాంటి వాళ్ల కోసం ఒక నిండు రంగుతో పాటు బంగారం, వెండి.. ఇలా మెరుపుల పాలిష్లనూ జతగా ఇస్తున్నారు. నెయిల్ పాలిష్ వేసుకోవడం అన్నది ఒక కళగా మారిన ఈ రోజుల్లో టూ ఇన్ వన్ నెయిల్‌పాలిష్‌లు యూత్‌కు టూ మచ్‌గా నచ్చేయడంలో వింతేం లేదు. ‘గోటి కోసం కోటి తిప్పలు’ అంటే ఇదే!

Read More :
“నెయిల్ పాలిష్ ఎక్కువ రోజులు ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి”
“మారిన ఫ్యాషన్.. కొత్త రంగులు, వింత షేడ్స్‌లో నెయిల్ పాలిష్”
“గోళ్లు కొరుకుతున్నారా? ఈ అలవాటు మానకపోతే ఎంత ప్రమాదమో తెలుసా !!”
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
- Tags
- beauty tips
- Nail
- Nail Polish
- nails
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

