నెయిల్ పాలిష్ ఎక్కువ రోజులు ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి
Nail Polish Tips | కొందరికి గోళ్లంటే విపరీతమైన ప్రేమ. కంటికి రెప్పలా కాపాడుకుంటారు. చూపులన్నీ తమ గోరు వంకే ఉండాలని తెగ ముస్తాబు చేస్తారు. మగువ చేతి వేళ్లకు మకుటాల్లాంటి గోళ్లు అందంగా కనిపించాలంటే నెయిల్ పాలిష్‌ను నమ్ముకోవడం మినహా మరో మార్గం లేదు. కానీ, ఆ రంగు కొంతకాలానికే వెలిసిపోతుంది. గోళ్ల పెయింట్ ఎక్కువసేపు ఉండటానికి ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

నెయిల్ పాలిష్ వేసుకునే ముందు గోళ్లను బాగా శుభ్రం చేసుకోవాలి. సబ్బు నీటిలో కొద్దిసేపు నానబెట్టి, గోళ్ల చుట్టూ ఉండే డెడ్‌స్కిన్‌ను, తెల్లటిపొరను నిదానంగా తొలగించాలి. నచ్చిన
ఆకృతిలో గోళ్లు కట్ చేసుకోవాలి. తర్వాత మెత్తటి వస్త్రంతో తుడుచుకోవాలి. మాయిశ్చరైజర్ రాసి.. పది నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోళ్లపై సన్నని బేస్కోట్ను చివరి వరకూ అప్లయ్ చేయాలి. ఇది నెయిల్ పాలిష్ ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది. బేస్‌కోట్ ఆరిన తర్వాత నచ్చిన నెయిల్ పాలిష్‌ను ఒకసారి వేసి ఆర బెట్టాలి. మళ్లీ మూడు తేలికపాటి కోట్స్ వేసుకోవాలి. చివరి కోటింగ్ మాత్రం జాగ్రత్తగా వేసుకోవాలి. నెయిల్ పాలిష్‌కు తగ్గట్లు పైన మెరుపును జోడించాలనుకుంటే.. షిమ్మర్, గ్లాసీ టాప్ కోటింగ్ ఉత్తమం. నెయిల్ కలర్ పూర్తయిన తర్వాత గోళ్లను గాలిలో ఆరబెట్టాలి.. లేదంటే ఐదు నిమిషాలు చల్లటి నీటిలో నానబెట్టాలి. దీని వల్ల పాలిష్ ఎక్కువ రోజులు నిలుస్తుంది.
Read More :
గోళ్లు కొరుకుతున్నారా? ఈ అలవాటు మానకపోతే ఎంత ప్రమాదమో తెలుసా !!”
“మారిన ఫ్యాషన్.. కొత్త రంగులు, వింత షేడ్స్‌లో నెయిల్ పాలిష్”
“Eye Lashes | కనురెప్పలను ఇలా మీకు నచ్చినట్లు మార్చేయండి”
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
- Tags
- beauty tips
- Nail
- Nail Polish
- nails
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

