Eye Lashes | సోగకనుల సొంపులెంత బాగుంటాయో… కనురెప్పల ఒంపులూ అంతే అందంగా ఉంటాయి. కానీ చూడచక్కని కనురెప్పలు అందరికీ ఉండాలంటే కష్టమే. ఆ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకునే కృత్రిమమైన కనురెప్పలను తయారు చేస్తున్నాయి సౌందర్యోత్పత్తుల సంస్థలు. అలాంటిదే ఈ మధ్య మార్కెట్లోకి వచ్చిన ‘సింప్లీ నామ్ ప్రొ క్లస్టర్ ఐలాష్ సెట్ ( simply nam pro cluster eyelashes )’. ఇందులో సందర్భానికి తగ్గట్టు బాగా పెద్దగా, ఒత్తుగా కనిపించేలానో… మామూలుగా ఒంపుగా కనిపించేలానో.. నచ్చినట్టు పెట్టుకునేలా రకరకాల సైజుల్లో ఐలాష్లు దొరుకుతున్నాయి. చూసేందుకు సహజ సిద్ధంగా కనిపించడం వీటి ప్రత్యేకత.
ఎండాకాలంలో పెండ్లి కూతుళ్లు అందంగా కనిపించాలంటే ఇలా చేస్తే సరి!!
“పుట్టగొడుగులు ఆరోగ్యానికే కాదు.. అందాన్ని కూడా పెంచుతాయని తెలుసా!!”