చంద్రబింబం లాంటి వదనం. కానీ, మొటిమలతో ముఖారవిందం వికారంగా మారిపోయిందని బాధపడుతుంటారు. పింపుల్స్‌ను తగ్గించుకోవడానికి రకరకాల క్రీములు వాడుతుంటారు. కానీ, మొటిమలు రావడానికి గల కారణాలు తెలుసుకొని, వాటిని నివారించగలిగితే ఈ సమస్య చాలా వరకు తీరుతుంది.
జిడ్డు చర్మం ఉన్నవారికి మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోజులో నాలుగైదుసార్లు చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఉదయం, సాయంత్రం రోజ్‌వాటర్‌తో ముఖం కడిగితే మొటిమల తీవ్రత తగ్గుతుంది.
నూనె పదార్థాలు మొటిమలకు కారణం అవుతాయి. రెగ్యులర్ డైట్లో నూనె శాతం తగ్గించాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. నీళ్లు బాగా తాగాలి. పండ్ల రసాలు తీసుకోవాలి.
డిప్రెషన్లో ఉన్నవారికి సైతం మొటిమలు వచ్చే అవకాశం ఉందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. మానసికంగా సంతోషంగా ఉండాలి.
ఆహారం విషయంలో సమయపాలన పాటించకపోవడం వల్ల కాలేయంలో ఉత్పత్తి అయ్యే యాసిడ్లు మొటిమలకు దారి తీస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే, సమయానికి తగు ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి.
కొందరు మొటిమలను గిచ్చేస్తుంటారు. దీనివల్ల ఇన్ఫెక్షన్ పెరగడమే కాకుండా ఆ ప్రాంతంలో చర్మంపై గుల్లలు ఏర్పడతాయి. మొటిమలు ఉన్న వాళ్లు టమాటా, నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పాళ్లు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయల ప్యాక్‌లు వేసుకోకూడదు.
సాలిసిలిక్ ఆయిల్, టీట్రీ ఆయిల్ కలిగిన ఫేస్‌వాష్‌లను ఉపయోగించడం వల్ల మొటిమలు తగ్గుముఖం పడతాయి. కలబంద జెల్‌తో కస్తూరి కలిపి ఫేస్‌ప్యాక్‌గా వేసుకున్నా మొటిమలకు చెక్ పెట్టవచ్చు.