Apps:
Follow us on:

Pimples | మొటిమలతో బాధపడుతున్నారా? వంటింట్లో దొరికే దీంతో సమస్యను ఇట్టే దూరం చేయొచ్చు!

1/6Pimples | ఒక వయసు రాగానే మొటిమలు రావడం మామూలే. కానీ దాని నివారణకు మనం కచ్చితంగా కొన్ని చిట్కాలు పాటించి తీరాల్సిందే! లేకపోతే ముఖం మీద మచ్చలు పడుతాయి. అలా జరగకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించి చూడండి..
2/6వెల్లుల్లి రెబ్బలను మెత్తగా చేసి అందులో ఒక టేబుల్‌ స్పూన్ పెరుగు వేయాలి. మొటిమలు ఉన్న ప్రాంతంలో ఈ మిశ్రమాన్ని రాసి మర్దన చేయాలి. కాసేపు ఉంచిన తర్వాత చల్లని నీటితో కడిగిస్తే సరిపోతుంది.
3/6వెనిగర్‌లో వెల్లుల్లి రెబ్బల పేస్ట్ వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట రాయాలి. కాటన్‌ బాల్‌తో అయినా మొటిమల మీద ఈ మిశ్రమాన్ని రాయొచ్చు. ఆరిన తర్వాత ముఖాన్ని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
4/6కలబంద గుజ్జును ఒక గిన్నెలో వేసుకోవాలి. వెల్లుల్లిని చిదిమి రసాన్ని వేరు చేయాలి. ఆ రసాన్ని కలబంద గుజ్జులో వేసి కలపాలి. దీన్ని మొటిమల మీద రాసి పావుగంట తర్వాత నీటితో శుభ్రం చేయాలి.
5/6ఒక గిన్నెలో గుడ్డు తెల్లసొన, వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా గిలక్కొట్టాలి. ఈ మిశ్రమాన్ని మొటిమల మీద రాయాలి. పొడిబారాక చల్లని నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే మొటిమల సమస్య దూరమవుతుంది.
6/6ఆలివ్ చర్మం మీద వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఆలివ్ ఆయిల్‌లో వెల్లుల్లి రెబ్బలను వేసి మిక్సీ పట్టాలి. ఈ నూనెను మొటిమల మీద రాసి పావుగంట తర్వాత నీటితో కడిగేయాలి.