Mehendi Blouse Design | గోరింటాకు చేతులు కాళ్లకే కాదు.. ఇప్పుడు వీపు దాకా పాకేసింది!
Mehendi Blouse Design | గోరింటాకు అరచేతిలో పండితే అందం. కాళ్లను చుడితే ముస్తాబు. అదే రవికగా మారిపోతే.. వీపునూ చేతులనూ అలంకరిస్తే.. కొత్త ట్రెండ్! అవును.. ఇప్పుడు బ్లౌజ్ మెహందీ సరికొత్త ట్రెండ్. అతిసాదా అలంకరణ నుంచి నిండైన నగల డిజైన్ల దాకా ఎన్నో రకాలు.. మెహందీ రవికల్లో కనువిందు చేస్తున్నాయి.
Mehendi Blouse Design | గోరింటాకు అరచేతిలో పండితే అందం. కాళ్లను చుడితే ముస్తాబు. అదే రవికగా మారిపోతే.. వీపునూ చేతులనూ అలంకరిస్తే.. కొత్త ట్రెండ్! అవును.. ఇప్పుడు బ్లౌజ్ మెహందీ సరికొత్త ట్రెండ్. అతిసాదా అలంకరణ నుంచి నిండైన నగల డిజైన్ల దాకా ఎన్నో రకాలు.. మెహందీ రవికల్లో కనువిందు చేస్తున్నాయి.
మెహందీ ఫంక్షన్ ఎంత ఘనంగా చేసుకున్నా, గోరింటాకులో ఎన్ని కొత్త డిజైన్లు ప్రయత్నించినా.. అలంకరించేది కాళ్లకూ, చేతులకేగా! ఎక్కడ చూసినా, ఎన్నేళ్లు గడిచినా ఇంతేనా.. అనుకునే ఆధునిక పెళ్లి కూతుళ్ల కోసం మెహందీ డిజైనర్లు సరికొత్త కాన్సెప్ట్‌తో ముందుకొచ్చారు. చూడగానే వావ్ అనిపించేలా, కళ్లతో చూస్తే కాదనలేని విధంగా కొంగొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. బ్లౌజ్ మెహందీ డిజైన్లు నేటి తరం పెళ్లి కూతుళ్ల బ్యాక్‌లెస్ జాకెట్లకు కొత్త అలంకారం.

ఎన్నో ఎన్నెన్నో..
మెహందీలో ఉన్నట్టుగానే ఇందులోనూ ఎన్నో రకాల డిజైన్లు అందాలొలికిస్తున్నాయి. విభిన్న మోటిఫ్ ప్రింట్లతో అచ్చం నిజం బ్లౌజ్లా కనిపించేలా, వెనక బటన్లు, అంచువెంట వేసే పూసలు, లేసులను కూడా అచ్చు గుద్దినట్టు ఇందులో చూపిస్తున్నారు కళాకారులు. వీపు మీద టాజిల్స్ వేలాడినట్టు, చిన్ని గంటలు వరుస కట్టినట్టూ కనికట్టు చేస్తున్నారు. ఆడపిల్లలకు వర్క్ బ్లౌజుల మీద ఉండే ఇష్టాన్ని గమనించి గ్రాండ్‌గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసినట్టు అనిపించే డిజైన్లనూ ఆవిష్కరిస్తున్నారు. పూలు, లతలు, మామిడి పిందెలు, ఏనుగులలాంటి మోటిఫ్‌లను ఇందుకోసం వాడుతున్నారు. వీపు మీద, చేతుల మీద నాజూగ్గా వచ్చే జాలీ వర్క్ ముద్దు గుమ్మలను మరింత ముగ్ధ మనోహరంగా చూపిస్తుంది. మరింత సునిశితంగా ఉండే నగల డిజైన్లను చేయి తిరిగిన కళాకారులు ఈ బ్లౌజ్ మెహందీలో మెరిపిస్తున్నారు.

చీరతో పాటు ఫ్యాషనబుల్ డ్రెస్సుల మీదకీ నప్పేలా మాడ్రన్ జువెలరీ డిజైన్లతోనూ మెహందీని పెడుతున్నారు. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్‌ల కోసం పల్లకీ తరహా డిజైన్లు అదుర్స్ అనిపిస్తున్నాయి. చేతులకు ఒకరకంగా, బాడీకి మరోరకంగా వచ్చే డిజైన్లు ఎక్కువ మందికి ఫేవరెట్‌గా ఉంటున్నాయి. బ్యాక్‌లెస్ కాకుండా స్లీవ్‌లెస్ మాత్రమే వేసుకునే వాళ్లకోసం అరచేతిలో మొగ్గ తొడిగిన గోరింటకు మ్యాచింగ్‌గా చేతులకూ డిజైన్‌ను వేస్తున్నారు. ఇవైతే పెళ్లికూతుళ్లకే కాదు, విడిగా ఈవెంట్లకు వేసుకునేందుకూ నప్పుతాయి. ఇక నుంచీ అరచేత మాత్రమే కాదు అందాల వీపుమీదా గోరింట మొగ్గ తొడుగుతుందన్న మాట!

Read More :
Barbie | బోలెడంత డబ్బులు ఖర్చు చేసి మరీ బార్బీ బొమ్మల్లా మారిపోయిన అందాల భామలు వీళ్లే”
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
- Tags
- fashion
- Mehendi
- Mehendi Blouse
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

