Button Masala | కుట్టు పని కనిపించకుండానే డ్రెస్సుల డిజైన్.. అహ్మదాబాద్ కుర్రాడి ఆలోచనకు ఫ్యాషన్ రంగం ఫిదా!
Button Masala | బటన్ మసాలా.. పేరు మాత్రమేనా, ఆ ఫ్యాషన్ సంస్థ డిజైన్లూ కొత్తగానే ఉంటాయి. గౌన్, చుడీదార్, ఫ్రాక్.. ఏదైనా సరే ఎక్కడా కుట్టుపని కనిపించదు. ఆ స్థానంలో నాణాలు, క్యారెమ్బోర్డు కాయిన్స్ మొదలైనవి గుండీలుగా దర్శనమిస్తాయి.
Button Masala | బటన్ మసాలా.. పేరు మాత్రమేనా, ఆ ఫ్యాషన్ సంస్థ డిజైన్లూ కొత్తగానే ఉంటాయి. గౌన్, చుడీదార్, ఫ్రాక్.. ఏదైనా సరే ఎక్కడా కుట్టుపని కనిపించదు. ఆ స్థానంలో నాణాలు, క్యారెమ్బోర్డు కాయిన్స్ మొదలైనవి గుండీలుగా దర్శనమిస్తాయి. వాటితోనే సాధారణ వస్ర్తాన్ని కూడా డిజైనర్ డ్రెస్‌గా మార్చేస్తాడు అంజూ శర్మ. అంతేకాదు, గుండీలు వేసుకునే తీరు మారితే.. డిజైన్ మొత్తం మారి పోయేలా జాగ్రత్తపడతాడు. అంటే, ఒక డ్రెస్‌ను వేరువేరుగా అలంకరించుకోవచ్చు.
క్యాంపస్ రోజుల్లో ఓ అబ్బాయి.. చొక్కా గుండీలను అటూ ఇటూ వేసుకుని ఫ్యాషనబుల్‌గా కనిపించినప్పుడు తనకు ఈ ఆలోచన వచ్చిందని చెబుతాడు అంజూ. అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ పూర్వ విద్యార్థి అయిన ఈ యువకుడు.. అమ్మాయిల మనసెరిగిన సృజనకారుడు. ఏ డ్రెస్‌కు అయినా ఆర్గానిక్ ఫ్యాబ్రిక్‌నే ఎంచుకుంటాడు. సహజమైన రంగులకే ప్రాధాన్యం ఇస్తాడు. ప్రధానంగా ఇన్‌స్టా ద్వారానే విక్రయాలు జరుగుతాయి. అయితేనేం, అమ్మాయిలు ఎగబడి కొంటారు. ముంబై ఫ్యాషన్ వీధుల్లో గుండీల డిజైన్ ఓ ట్రెండ్ ఇప్పుడు.
– సీఎం. ప్రవీణ్
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

