Betal Leaf Decorations | కేవలం తాంబూలం కోసమే కాదు.. అందమైన డెకరేషన్లకూ తమలపాకులే ట్రెండ్!
Betal Leaf Decorations | తమలపాకులో వక్క ఉంచితే తాంబూలం. సున్నం రాసి మెలితిప్పితే చిలక. అదే జర్దా జోడిస్తే కారా కిళ్లీ. అంతేనా.. ఆకంటే అంతకుమించి కూడా. అలంకారంలోనూ అగ్రతాంబూలం అందుకుంటున్నది. అందాలను ఆకుపచ్చని సోకై ఆవిష్కరిస్తున్నది. అవును ‘బెటల్ లీఫ్ డెకరేషన్' కొత్త ట్రెండ్. ముద్దులొలికే బొమ్మ నుంచి ముదితలు కొలిచే అమ్మ దాకా రకరకాల ముస్తాబుల్లో మెరుస్తున్నది.
Betal Leaf Decorations | తమలపాకులో వక్క ఉంచితే తాంబూలం. సున్నం రాసి మెలితిప్పితే చిలక. అదే జర్దా జోడిస్తే కారా కిళ్లీ. అంతేనా.. ఆకంటే అంతకుమించి కూడా. అలంకారంలోనూ అగ్రతాంబూలం అందుకుంటున్నది. అందాలను ఆకుపచ్చని సోకై ఆవిష్కరిస్తున్నది. అవును ‘బెటల్ లీఫ్ డెకరేషన్’ కొత్త ట్రెండ్. ముద్దులొలికే బొమ్మ నుంచి ముదితలు కొలిచే అమ్మ దాకా రకరకాల ముస్తాబుల్లో మెరుస్తున్నది.
అలంకరణలో పువ్వులు ఎప్పుడూ ముందే ఉంటాయి. ఇటీవల పండ్లూ, వాటి కార్వింగ్లూ కనిపిస్తూనే ఉన్నాయి. మేం మాత్రం తక్కువ తిన్నామా అంటున్నాయి తమలపాకులు. పెండ్లిండ్లూ పేరంటాల సమయంలో.. బొమ్మలకు అందాల ఆకుపచ్చ చీరను చుట్టినట్టు వీటితో అలంకరిస్తున్నారు. బొట్టూ, వాలుజడతో ఆ బొమ్మలు తెలుగు గుమ్మను గుర్తు చేస్తున్నాయి. నోముల అలంకరణతో పాటు పెండ్లిండ్లప్పుడు ఫలహారపు పళ్లాలలోనూ అమర్చుతున్నారు.

Betal Leaves2
ఎన్నో ముస్తాబులు ..
పెండ్లిండ్లప్పుడు తాంబూలాలు అందుకోవడానికి ఎంత ప్రాధాన్యం ఉందో, తాంబూల చర్వణానికీ అంతే విశిష్టత ఉంటుంది. కడుపు నిండిందని చేతులు కడిగినా సరే.. ఇంకొక్కటి తినాల్సింది మిగిలే ఉందని నోరూరించేలా కిళ్లీలు సిద్ధం చేస్తుంటారు. వాటికీ బొమ్మలు జోడించి ఆకులతో అలంకరిస్తున్నారిప్పుడు. నెమలి బొమ్మలనూ ఇలాగే తీర్చిదిద్దుతున్నారు. ఇక పండుగలూ, పూజలప్పుడు గణపతి,లక్ష్మిలాంటి వివిధ దేవతా ప్రతిమలకు పత్రరాజాలతోనే వస్త్రం సమర్పిస్తున్నారు. తమలపాకు జతగా గులాబీలు, మల్లెలు, చామంతులు, నందివర్ధనాలు జోడించి చేసే అలంకారాలు కొన్నయితే, కుందన్లు, లేసులు, పూసల్లాంటి వాటిని కలిపే రకాలు ఇంకొన్ని. వక్కలు, పసుపు కొమ్ముల్నీ ఈ డెకరేషన్లో వాడిచూపిస్తున్నారు. వీటిని చేసేందుకు మరీ శ్రమేం అవసరం లేదు. ఒక్కసారి యూట్యూబ్లో చూశామంటే మనమే వీటిని తీర్చిదిద్దుకోవచ్చు. కాస్త సృజన జోడిస్తే ఆకేసి.. వక్కేసి.. ఆశ్చర్యమేసి.. అన్న రీతిలో అందర్నీ మురిపించవచ్చు. వేడుకను పండించుకోవచ్చు.


Betal Leaves4
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

