శుక్రవారం 07 ఆగస్టు 2020
Beauty-tips - Jan 22, 2020 , 00:05:17

లిప్‌స్టిక్‌ కాదు..

లిప్‌స్టిక్‌ కాదు..

అచ్చం అది లిప్‌స్టిక్‌గానే కనిపిస్తుంది.  కానీ లిప్‌స్టిక్‌ కాదు. ఆది ఓ ఆయుధం. మహిళలు  ఆత్మరక్షణ కోసం ఉపయోగించుకొనే గన్‌గా ఉపయోగపడుతుంది. శ్యామ్‌ చౌరాసియా అనే ఔత్సాహిక శాస్త్రవేత్త దీన్ని తయారు చేశాడు. మహిళలు ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు దీని  బటన్‌ను నొక్కగానే పేలుడు వంటి పెద్ద శబ్దం చేస్తుంది. అట్లాగే 112 ఎమర్జెన్సీ నంబర్‌కు సమాచారం అందిస్తుంది. సాధారణ లిప్‌స్టిక్‌లాగే దీన్ని మహిళలు తమ వెంట తీసుకెళ్లవచ్చు. ఇది ఒక ఆత్మరక్షణ ఆయుధం అని ఎవరికీ అనుమానం రాదని అతను తెలిపాడు. దీని ఖరీదు కేవలం ఆరు వందల రూపాయలే. దీనిమీద పూర్తి పేటెంట్‌ హక్కులు తీసుకుంటానని ఆయన పేర్కొన్నాడు. 


logo