ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 10, 2020 , 00:15:14

నిరుపేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్‌ : మంత్రి అజయ్‌

నిరుపేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్‌ : మంత్రి అజయ్‌

ఖమ్మం, నమస్తే తెలంగాణ : అనారోగ్య రీత్యా మెరుగైన వైద్యం పొందిన వారికి అర్థిక వెసులుబాటు కల్పించేందుకు ఖమ్మం నియోజకవర్గంతో పాటు జిల్లాలోని పలువురి విన్నపం మేరకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సీఎం సహాయనిధికి చేసిన సిఫారసులు ఫలించాయి. ఆయా లబ్ధిదారులకు ప్రభుత్వం ఖమ్మం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సిఫారసు మేరకు మంజూరైన 68మందికి తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్‌ పాపాలాల్‌తో కలిసి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఖమ్మం నుంచి వైద్యం పొందిన పేదలకు ప్రభుత్వం చేయూతగా అందిస్తున్న సీఎం సహాయనిధి ద్వారా ఇప్పటి వరకు కోటి రూపాయలకు పైగా  ప్రభుత్వం నుంచి సహాయం అందచేశామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో పారదర్శంకంగా అమలు చేస్తోందన్నారు. వైద్య చికిత్సలు పొందినవారికి సీఎంఆర్‌ఎఫ్‌ సంజీవని వంటిదన్నారు. ఈ మేరకు మంజూరైన చెక్కులను మంత్రి అజయ్‌కుమార్‌ చేతుల మీదుగా బాధితులు, వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. వివిధ రకాల వ్యాధి బాధలతో వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి తదుపరి మందులు, ఇతర అర్థ్ధిక అవసరాలు తీర్చేవిధంగా సీఎం సహాయనిధికి చేసిన సిఫారసులు ఫలించాయి. అందుకు సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్‌ బాధితుల తరుఫున కృతజ్ఞతలు తెలిపారు. సీఎంఆర్‌ఎఫ్‌-67, ఎల్‌వోసీ-1మోత్తం 68మందికి  రూ. 25.57 లక్షలు అందజేశామన్నారు. నేటి వరకు 410 మందికి లబ్ధి చేకూరిందని, అందుకు రూ. 1.76 కోట్ల విలువగల చెక్కులను పంపిణీ చేశామన్నారు. మన వినతి స్వీకరించి చెక్కులు మంజురు చేయడంపై సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  కార్యక్రమంలో ఖమ్మం డిప్యూటీ మేయర్‌ బత్తుల మురళీ, టీఆర్‌ఎస్‌ ఖమ్మం నగర అధ్యక్షుడు కమర్తపు మురళీ,  ఆర్‌జేసీ కృష్ణ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, కుర్రా భాస్కర్‌రావు, తుమ్మలపల్లి మోహన్‌రావు, గుత్త రవి ఉన్నారు.