గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 04, 2020 , 00:31:45

సొసైటీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు

సొసైటీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు

పాల్వంచ రూరల్‌ : మండలంలో సొసైటీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ వివరాలను ఎన్నికల అధికారి ఎం రమ సోసైటీ కార్యాలయంలో సోమవారం విడుదల చేశారు. పాల్వంచ సొసైటీలో 3వేల మంది సభ్యులు ఉండగా ఓటర్లు 2092 మంది ఓటర్లు ఉన్నారు. సొసైటీలో దాదాపు 55 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలను 13 వార్డులుగా విభజించారు. ఒక్కో వార్డులో 160-170 మధ్య ఓటర్లు ఉన్నారు. రిజర్వేషన్లలో ఓసీ-8, బీసీ-2, ఎస్సీ-2, ఎస్టీ-1 ఉన్నాయి. కేవలం మహిళలకు 7, 9 వార్డులు రిజర్వేషన్‌ చేయబడ్డాయి. పురుష ఓటర్లు 1478,  మహిళా ఓటర్లు 614 మంది, మొత్తం 2092 మంది ఓటర్లు ఉన్నారు.  ఈ నెల 6, 7 తేదీలలో పట్టణంలోని సొసైటీ కార్యాలయంలో నామినేషన్లను స్వీకరిస్తారు. ఎన్నికలు ఈ నెల 15వ తేదీన పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జరగనున్నాయి.