అమరావతి: ఆంధ్రప్రదేశ్ నుంచి 2021 సివిల్స్ టాపర్స్‌గా నిలిచిన వారిని ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వారితో జగన్ ఇంటరాక్ట్ అయ్యారు. వారు ఎలా సివిల్స్ టాపర్స్‌గా నిలిచారంటూ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబ నేపథ్యం, చదివిన విధానం గురించి వారితో సంభాషించారు.
రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించడంలో, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఐఏఎస్‌ల సేవలు ముఖ్యమైనవని జగన్ చెప్పారు. టాపర్స్‌గా నిలిచిన మీరంతా ఆ దిశగా కృషి చేయాలని వారికి ముఖ్యమంత్రి సూచించారు. ఒక్కొక్కరిని పేరుపేరునా పలకరిస్తూ భుజం తట్టి అభినందనలు తెలిపారు. 10 మంది యువకులు రానున్న రోజుల్లో ఏపీ ప్రభుత్వ పాలనలో కీలకం అవుతుండటం అదృష్టమని కొనియాడారు. ప్రజల కోసం పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని వారికి జగన్ సూచించారు.