Weather Update | తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. ఏపీలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్
Weather Update | తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో వడగాలులు వీస్తున్నాయి. వీటికారణంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలను దాటేశాయి. 130 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తున్నాయి.
Weather Update | తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో వడగాలులు వీస్తున్నాయి. వీటికారణంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలను దాటేశాయి. 130 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. సాధారణం కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో 0.5, ఏపీలో 0.9 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాగా వీటికి వాతావరణ మార్పులే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వడగాలుల నేపథ్యంలో వాతావరణ శాఖ ఏపీలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ, రేపు ఎనిమిది జిల్లాలకు.. ఎల్లుండి 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సత్యసాయి, కడప, నెల్లూరు, అనంతపురం, నంద్యాల, కర్నూలు, ప్రకాశం, పల్నాడు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని కోరింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు బయటకు వెళ్లకపోవడమే మంచిదని.. తప్పనిసరి అయితే టోపీ, గొడుగు వంటివి ధరించాలంటున్నారు. కాగా, వడగాలుల నేపథ్యంలో వృద్ధులు, గర్భిణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. డీహైడ్రేట్ కాకుండా ఉండేందుకు ఓఆర్ఎస్, ఇంట్లోనే తయారు చేసిన పానీయాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి తాగాలని సలహానిస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- AP News
- Heat Waves
- Summer
- weather
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

