అంబానీ పెళ్లికి టైమ్ ఉంది కానీ.. ముచ్చుమర్రి బాధితులను కలిసేందుకు టైమ్ లేదా?.. బాబు, పవన్‌ను నిలదీసిన వైసీపీ ఎమ్మెల్సీ
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి నిలదీశారు. ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లికి వెళ్లేందుకు మీకు సమయం ఉంది కానీ.. ముచ్చుముర్రి బాధితులను పరామర్శించేందుకు సమయం లేదా అని ప్రశ్నించారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి నిలదీశారు. ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లికి వెళ్లేందుకు మీకు సమయం ఉంది కానీ.. ముచ్చుముర్రి బాధితులను పరామర్శించేందుకు సమయం లేదా అని ప్రశ్నించారు.
విశాఖలో ఆదివారం నాడు నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో మైనర్ బాలిక హత్యాచారం జరిగి వారం రోజులు గడుస్తున్నా.. కూటమి ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు అంబానీ ఇంట్లో పెళ్లి వెళ్లే సమయం ఉంది కానీ.. బాధితులను పరామర్శించేందుకు సమయం లేదని మండిపడ్డారు. రాష్ట్ర హోంమంత్రి అనిత నియోజకవర్గంలోనే బాలిక హత్యాచారం జరిగితే బాధిత కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు దారి తప్పాయని వరుదు కల్యాణి అన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని విమర్శించారు. ఏపీలో మహిళలపై దాడులు అరికట్టకపోతే వైసీపీ పోరాటాలకు సిద్ధమవుతుందని హెచ్చరించారు.
నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలిక హత్యాచార ఘటనపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. వారం రోజులు గడుస్తున్నా బాలిక ఆచూకీ ఇంకా తెలియడం లేదు. బాలికను చంపిన తర్వాత కాల్వలో పడేశామని మైనర్ బాలురు చెప్పడంతో సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టిన అధికారులు ఇప్పటివరకు బాలిక మృతదేహాన్ని కనిపెట్టలేకపోయారు. ఈ క్రమంలో బాలిక మృతదేహం విషయంలో మైనర్ బాలురు, వాళ్ల తల్లిదండ్రులు చెబుతున్న మాటలు పలు అనుమానాలకు రేకెత్తిస్తున్నాయి.
ఈ నెల 7వ తేదీన పార్క్‌లో ఆడుకుంటున్న 8ఏళ్ల బాలికను ముగ్గురు మైనర్ బాలురు ఎత్తికెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం చంపేసి మృతదేహం దొరక్కుండా చేశారు. అయితే బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసి విచారించగా చంపిన తర్వాత కాల్వలో పడేశామని చెప్పారు. దీంతో పోలీసులు కాల్వలో వెతికించారు. కానీ మృతదేహం దొరకలేదు. ఆ తర్వాత శ్మశానంలో పాతిపెట్టామని చెప్పారు. ఎవరికీ అనుమానం రాకుండా స్పాట్లో క్షద్రపూజలు చేసిన ఆనవాళ్లను కూడా క్రియేట్ చేశారు. దీంతో నిందితులు చెప్పిన దాని ప్రకారం ముచ్చుముర్రితో పాటు కొణిదెల, వనములపాడు గ్రామాల్లోని శ్మశాన వాటికల్లోనూ తనిఖీలు చేపట్టారు. ఇదిలా ఉంటే తాజాగా మృతదేహాన్ని కృష్ణా నదిలో పడేశామని కూడా చెబుతున్నారు. దీంతో బాలిక మృతదేహం ఏమై ఉంటుందోనని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మృతదేహం దొరక్కపోవడంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ బిడ్డ మృతదేహాన్ని వీలైనంత త్వరగా అప్పగిస్తే దహన సంస్కారాలు చేసుకుంటామని విలపిస్తున్నారు. మైనర్లు కాబట్టి శిక్ష తగ్గించకూడదని.. కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించాలని కోరుతున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- AP News
- muchumarri
- murder
- Nandyala
RELATED ARTICLES
తాజా వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Angomcha Bimol | ఆ ఎంపీని సస్పెండ్ చేయండి.. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు
Eye Sight | భారతీయుల్లో పెరుగుతున్న దృష్టి లోపం సమస్య.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు..
Dubai ETCA | దుబాయ్‌లో ఘనంగా ETCA 16వ బతుకమ్మ సంబరాలు.. 6 వేల మందికిపైగా తెలంగాణ ప్రవాసుల భాగస్వామ్యం
కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

