YS Jagan | ఏపీలో భారీగా పెరుగుతున్న అప్పులు.. కాగ్ నివేదికపై జగన్ ఆందోళన
YS Jagan | ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు రోజురోజుకీ క్షీణిస్తున్నాయని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయం తగ్గిపోయి.. అప్పులు గణనీయంగా పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ నివేదికను ఉటంకిస్తూ ట్విట్టర్(ఎక్స్) వేదికగా ఆయన ధ్వజమెత్తారు.
YS Jagan | ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు రోజురోజుకీ క్షీణిస్తున్నాయని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయం తగ్గిపోయి.. అప్పులు గణనీయంగా పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ నివేదికను ఉటంకిస్తూ ట్విట్టర్(ఎక్స్) వేదికగా ఆయన ధ్వజమెత్తారు.
గత ఐదేళ్ల కాలంలో, 2019-24 మధ్యలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీల వల్ల రాష్ట్రంలో ఆదాయం తగ్గిందని, అభివృద్ధి లేనేలేదని టీడీపీ, జనసేన పార్టీలు తప్పుడు ప్రచారం చేశాయని వైఎస్ జగన్ మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామని నమ్మబలికారని అన్నారు. కానీ 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం స్వీయ ఆదాయాలు (పన్ను, పన్నేతర ఆదాయాలు కలిపి) కేవలం 3.08% మాత్రమే పెరిగిందని తెలిపారు. ఇదే సమయంలో దేశ జీడీపీ 9.8 శాతానికి పెరిగిందని, కేంద్ర ఆదాయం 12.04 శాతం పెరిగిందని ఆయన గుర్తుచేశారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు నిజంగా 12 శాతం ఉంటే.. ఆదాయాలు ఎందుకు ఇంత నిరాశాజనకంగా ఉన్నాయని ఆయన ప్రశ్నించారు.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొంత ఆశాజనకంగా ఉంటుందనుకుంటే మొదటి నాలుగు నెలల్లో కూడా అదే పరిస్థితి నెలకొందని చెప్పారు. తొలి నాలుగు నెలల్లో జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయాలు తగ్గిపోయాయని తెలిపారు. ప్రజల్లో కొనుగోలు శక్తి కూడా బాగా తగ్గిపోయిందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆదాయాల వృద్ధి 10 శాతం ఉండాల్సి ఉండగా.. కేవలం 2.39 శాతం మాత్రమే ఉందని విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల అప్పులు కలిసి 3,32,671 కోట్లు మాత్రమే ఉండేదని.. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే రూ.1,86,361 కోట్ల అప్పు చేసిందని జగన్ తెలిపారు. అంటే.. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పులతో పోలిస్తే ఇది 56 శాతం ఉంటుందని పేర్కొన్నారు.
2019–24 మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం **₹3.32 లక్షల కోట్లు** అప్పులు చేసినా, ప్రస్తుత టిడిపి–జనసేన కూటమి ప్రభుత్వం కేవలం 14 నెలల్లోనే **₹1.86 లక్షల కోట్లు** అప్పు చేసిందని, ఇది ఐదేళ్లలో వైఎస్సార్సీపీ చేసిన మొత్తం అప్పులలో 56% కి సమానమని వివరించారు. రాష్ట్ర ఆదాయం తగ్గడం, అప్పులు పెరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ తమ పాలనా విధానంపై పునరాలోచన చేయాలని సూచించారు. అన్ని స్థాయిల్లో అవినీతి విస్తరిస్తోందని.. దాన్ని అరికట్టాలన్నారు.
𝙏𝙝𝙚 𝘾𝘼𝙂 𝙛𝙞𝙜𝙪𝙧𝙚𝙨 𝙧𝙚𝙫𝙚𝙖𝙡 𝙘𝙤𝙣𝙩𝙞𝙣𝙪𝙞𝙩𝙮 𝙤𝙛 𝙛𝙞𝙨𝙘𝙖𝙡 𝙨𝙩𝙧𝙚𝙨𝙨
During the five year period, 2019-24, the then opposition parties TDP and JSP continuously lied that the then Government’s policies were resulting in unchecked growth in liabilities and… pic.twitter.com/X0JeWvpxVE
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2025
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- AP News
- ap revenue
- CAG
- ys jagan
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

