YS Viveka Murder Case | కడప కోర్టు ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్తా : సునీత
YS Viveka Murder Case | వైఎస్ వివేకా హత్య (YS Viveka Murder ) ప్రచారంపై కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్తానని వైఎస్ వివేకా కూతురు సునీత వెల్లడించారు.
అమరావతి : వైఎస్ వివేకా హత్య (YS Viveka Murder ) ప్రచారంపై కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్తానని వైఎస్ వివేకా కూతురు సునీత ( Sunitha ) వెల్లడించారు. ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్ వివేకా హత్యా నిందితుల పేర్లను ఎక్కడా కూడా ప్రస్తావించవద్దని గురువారం కడప కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ముఖ్యంగా సునీత, షర్మిల(Sharmila) , చంద్రబాబు(Chandra Babu), పవన్ కల్యాణ్(Pawan Kalyan) , నారా లోకేష్, పురందేశ్వరి, పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిలు వివేకా హత్య కేసు అంశం మాట్లాడవద్దని వైసీపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో వైసీపీ(YCP) ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డిని హంతకుడిగానూ, సీఎం జగన్ ఆయన్ను కాపాడుతున్నట్లుగానూ చేస్తున్న ప్రచారాలను ఆపాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల తరుఫున ప్రచారం చేస్తున్న సునీత కేసుపై స్పందించింది. న్యాయం కోసం ప్రజాతీర్పు కోరుతుంటే వైసీపీ అడ్డుపడుతుందని, పులివెందులలో ప్రచారం చేయకుండా కేసులు వేస్తున్నారని ఆరోపించారు. ప్రచారంలో భాగంగా తాను ఇంటింటికి రాలేకపోతున్నానని, ఎన్నికల్లో షర్మిలను గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

