అమరావతి : వైసీపీ నాయకులపై అనుచిత పోస్టులు పెట్టిస్తున్న మంత్రి లోకేష్ ( Minister Lokesh) పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Former Minister Ambati) ప్రశ్నించారు. గుంటూరు జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాది క్రితం టీడీపీ (TDP) చేసిన ఫిర్యాదుపై ఇప్పుడు అరెస్టులు చేయడం దారుణమని అన్నారు.
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ( YS Jagan ) కుటుంబ సభ్యులపై , నాయకులపై అసభ్యకరంగా పోస్టులు పెట్టారని ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. మీకో న్యాయం. మాకో న్యాయమా అంటూ నిలదీశారు. తప్పుడు కేసులతో భయపెట్టాలని చూస్తున్నాయని, ఎప్పటికైనా తప్పుడుకేసులు కోర్టులో రుజువు కావని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పులు మీద తప్పుడు చేస్తున్నారని విమర్శించారు.
నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాల్సిన పోలీసులు నలిగిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులపై మీద కేసులు నమోదు చేయకపోతే ప్రభుత్వం నుంచి ఒతిళ్లకు గురవుతున్నారని, మరోవైపు వైసీపీ రానున్న సమయంలో అధికారంలో వస్తే తమ పరిస్థితి ఏమిటని భయపడుతున్నారని అంబటి వెల్లడించారు. వైసీపీ సోషల్ మీడియాను అణిచివేసి టీడీపీకి ఉన్న సోషల్ మీడియాను రైజ్ చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.