అమరావతి : ఏపీలో పెళ్లి బస్సుకు పెను ప్రమాదం తృటిలో తప్పింది. డ్రైవర్ అప్రమత్తతో ప్రాణనష్టం జరుగ లేదు. కాకినాడ ( Kakinada District ) జిల్లాలో సోమవారం పెళ్లి బృందం బస్సులో సత్యగిరి నుంచి రాజమహేంద్రవరానికి బయలు దేరింది. అన్నవరం ( Annavaram ) ఘాట్ రోడ్డులో బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును డివైడర్ను ఢీ కొట్టించారు. దీంతో బస్సు ఆగిపోవడంతో బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం బస్సుకు మరమ్మతులు చేయించడంతో అక్కడి నుంచి సాఫీగా కల్యాణ మండపానికి బయలు దేరారు.