Chandra Babu | యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం.. జగన్‌తో తాడోపేడో తేల్చుకుంటాం : చంద్రబాబు
Chandra Babu | టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra Babu) ఏపీ సీఎం జగన్ పాలనపై విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని, ఇక తాడోపేడో తేల్చుకుంటామని సవాలు చేశారు.
అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra Babu) ఏపీ సీఎం జగన్ పాలనపై విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని, ఇక తాడోపేడో తేల్చుకుంటామని సవాలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా బనగానపల్లెలో శుక్రవారం నిర్వహించిన ప్రజాగళం ప్రచారయాత్రలో ఆయన మాట్లాడారు.
మొన్నటి వరకు జగన్(Jagan) జిల్లాలకు వెళ్తుంటే ఆ వీధులలో ప్రజలెవ్వరూ బయటకు రాకుండా ఇంటి ముందు పరదాలుకట్టి పరదాల మాటున తిరిగారని ఆరోపించారు. జగన్ నేడు జనాల్లోకి వస్తుంటే జనాలు పారిపోతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి (Chief Minister) గా ఏనాడైనా జనాల్లోకి వచ్చి సమస్యలు అడిగి తెలుసుకోలేదని విమర్శించారు. చిన్నాన్న( వైఎస్ వివేకా) ను హత్య చేయించినవారికే సీట్లు ఇచ్చారు. దోషులను మాత్రం పక్కనపెట్టు్కుని తిరుగుతున్నాడని, చెల్లెలును జైలులో పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.
ఎన్నికల్లో సానుభూతి కోసం కోడికత్తి నాటకం ఆడారని పేర్కొన్నారు. వైసీపీ(YCP) ని చిత్తుగా ఓడించేందుకు సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీడీపీ(TDP) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు కదిరిలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

