అమరావతి : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిరసనలు వెల్లువెత్తుతుండగా కేంద్రం మరింత మొండిగా వ్యవహరిస్తుంది. విశాఖ ఉక్కు పరిశ్రమ వర్కింగ్ కేపిటల్, ముడిసరుకు కోసం బిడ్ల గడువు ఈరోజు (శనివారం) సాయంత్రం 4 గంటల వరకు ఉండగా దీనిని మరో 5 రోజుల పాటు పొడిగిస్తూ(Extend) ఆర్ఐఎన్ఎల్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 22 ప్రైవేట్ సంస్థలు బిడ్లకు టెండర్ దాఖలు చేశాయి.
ప్రైవేట్ కంపెనీ తరఫున సీబీఐ విశ్రాంత జేడీ లక్ష్మీనారాయణ(Former CBI JD Lakshminarayana ) రెండు బిడ్లను దాఖలు చేశారు. బిడ్డింగ్ పత్రాలను ఉక్కు పరిశ్రమ సీజీఎం సత్యానంద్‌కు అందజేశారు. ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ఆయన అన్నారు.
క్రౌడ్ ఫండింగ్(Crowd Funding), డిజిటల్ ట్రాన్స్ఫర్ ద్వారా నిధుల సేకరణకు ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. 8.5 కోట్ల మంది ఉన్న తెలుగు ప్రజలు నెలకు వంద రూపాయలు ఇస్తే నెలకు 850 కోట్లు వస్తాయని అలా నాలుగు నెలలు విరాళం ఇస్తే స్టీల్‌ప్లాంట్‌ను నిలబెట్టిన వాళ్లమవుతామని పేర్కొన్నారు.