గర్భిణీని తీసుకెళ్లేందుకు వచ్చిన అంబులెన్స్.. కరోనా భయంతో అడ్డుకున్న గ్రామస్తులు
అంబులెన్స్‌ను అడ్డుకున్న గ్రామస్తులు | గర్భిణీని ప్రసవం నిమిత్తం తరలించేందుకు అంబులెన్స్ వస్తుండగా కరోనా భయంతో గ్రామంలోకి రాకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు.

అమరావతి : కరోనా భయంతో గ్రామాల్లో కొందరు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు వైద్య సేవలు అందకుండా అడ్డుపడుతున్నారు. గర్భిణీని ప్రసవం నిమిత్తం తరలించేందుకు అంబులెన్స్ వస్తుండగా కరోనా భయంతో గ్రామంలోకి రాకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు.
విశాఖ జిల్లా జీ.మాడుగుల మండలం పాలమామిడి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో ఓ గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో దవాఖానకు తరలించేందుకు కుటుంబీకులు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ గ్రామశివారుకు రాగానే గ్రామంలోకి రాకుండా స్థానికులు అడ్డుకున్నారు.
దీంతో గత్యంతర లేక కుటుంబ సభ్యులే కాలినడకన ఆమెను అంబులెన్స్ వరకు తీసుకువచ్చారు. దవాఖానకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో అంబులెన్స్‌లోనే ఆమె ప్రసవించింది. తల్లీబిడ్డా క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇద్దరినీ జీ.మాడుగుల దవాఖానకు తరలించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Siddugadi Love Story | యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ కట్టిపడేస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. ఘనంగా సక్సెస్ మీట్!
Thiruveer | ‘శ్రీమతి’ నా జీవితంలో ఒక ఎమోషన్.. ఆ టైటిల్ వినగానే నా గతం గుర్తొస్తుంది : తిరువీర్
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

