Rahul Gandhi | కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి రెండు రోజుల్లో ప్రత్యేక హోదా : రాహుల్ గాంధీ
Rahul Gandhi | కేంద్రం, ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు రోజుల్లో ప్రత్యేక హోదాను కల్పిస్తామని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
అమరావతి : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు రోజుల్లో ప్రత్యేక హోదాను కల్పిస్తామని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. కడపలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తరుఫున నిర్వహించిన ప్రచార బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఏపీకి పది సంవత్సరాల పాటు ప్రత్యేక హోదాను కల్పిస్తామని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి రైతాంగానికి నీరందిస్తామని, కడప స్టీల్ ప్లాంట్‌ను పునరుద్దరిస్తామని ప్రకటించారు.
ఏపీకి చెందిన గత ప్రభుత్వాలు మోదీ వద్ద మోకరిళ్లడం వల్లే ప్రత్యేక హోదా (Special Status), పోలవరం, కడప స్టీల్ ప్లాంట్ రాలేదని ఆరోపించారు. రాజీవ్‌గాంధీ(Rajeev Gandhi), రాజశేఖర్‌రెడ్డి( Rajashekar reddy) అన్నదమ్ముల్లా ఉండేవారని వెల్లడించారు. వైఎస్సార్ ఏపీకే కాదు. మొత్తం దేశానికే దారి చూపించారని కొనియాడారు. వైఎస్సార్ తండ్రిలా నాకు మార్గదర్శనం చేశారని, పాదయాత్రల ద్వారానే ప్రజల సమస్యలు తెలుస్తాయని చెప్పారని వివరించారు. భారత్ జోడో యాత్రకు వైఎస్సార్ పాదయాత్రే స్ఫూర్తిని తెలిపారు.
వైఎస్సార్ పేరును ఛార్జ్‌షీట్‌లో కాంగ్రెస్ పెట్టిందని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఎవరో తమ స్వార్థం కోసం కడపలోని ఇడుపులపాయ వద్ద దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద రాహుల్ గాంధీ, షర్మిల నివాళి అర్పించారు. ఈ సందర్భంగా తండ్రితో ఉన్న సమయంలో జ్ఞాపకాలను షర్మిల రాహుల్‌కు వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

