Tragedy | గ్యాస్ సిలిండర్ లీక్ దుర్ఘటనలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి.. నాలుగుకు చేరిన మృతుల సంఖ్య
Tragedy | ఏపీలోని విశాఖ జిల్లా కేంద్రంలో గ్యాస్ సిలిండర్ లీకై (Gas cylinder) ఒకే కుటుంబానికి నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటనలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు బుధవారం మరణించారు.
అమరావతి : ఏపీలోని విశాఖ జిల్లా కేంద్రంలో గ్యాస్ సిలిండర్ లీకై (Gas cylinder) నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటనలో చికిత్స పొందుతూ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బుధవారం మరణించారు. జిల్లా కేంద్రంలోని మధురవాడ వాంబే కాలనీలో నివాసముంటున్న బాలరాజు అనే వ్యక్తి అయ్యప్పమాల ధరించాడు. గత శుక్రవారం వంట గ్యాస్ అయిపోవడంతో కొత్త సిలిండర్‌కు రెగ్యులేటర్‌ను అమర్చాడు.
రెగ్యులేటర్‌ను సక్రమంగా అమర్చకపోవడం వల్ల గ్యాస్ లీకేజీ(Gas leakage) అయిన విషయం అతడు గమనించ లేదు. కొద్ది సేపు అనంతరం దేవుడి చిత్రపటాల వద్ద దీపారాధన చేయడానికి అగ్గి వెలిగించడంతో ఒక్కసారిగా ఇంట్లో మంటలు వ్యాపించాయి. దీంతో బాలరాజుతో పాటు భార్య చిన్ని, కుమారులు గిరి, కార్తిక్‌కు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితులను 108 అంబ్లెన్స్లో కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ చిన్న కుమారుడు కార్తిక్ రెండు రోజుల క్రితం చనిపోగా బాలరాజు(60), అతడి భార్య చిన్ని (55), పెద్ద కుమారుడు గిరి(22) బుధవారం చికిత్సపొందుతూ మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించడం పట్ల కాలనీలో విషాదఛాయలు (Tragedy) అలుముకున్నాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

