ఎంపీ రఘురామ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ
ఎంపీ రఘురామ బెయిల్ పిటిషన్‌పై | పశ్చిమగోదావరి నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ ఉదయం 10 గంటలకు విచారణ జరుపనుంది.

అమరావతి : పశ్చిమగోదావరి నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ ఉదయం 10 గంటలకు విచారణ జరుపనుంది. సీఐడీ నమోదు చేసిన కేసులో ఎంపీ రఘురామకృష్ణరాజుకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై జస్టిస్ వినీత్ శరన్, జస్టిస్ బీఆర్ గవాయ్‌ల వెకేషన్ బెంచ్ విచారణ నిర్వహించనుంది.
ఏపీ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని ఎంపీ రఘురామను మూడు రోజుల కిందట సీఐడీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసింది. దీనిపై హైకోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ వేయగా.. కింది కోర్టుకు వెళ్లమని ఉన్నత న్యాయస్థానం సూచించింది. జిల్లా కోర్టు రఘురామకు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఎంపీ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ ఉదయం విచారణ జరుగనుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

