TTD Altered Ghee | తిరుమల – తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో కల్లీ నెయ్యితో లడ్డూ తయారీ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు నలుగురు వ్యక్తులను ఆదివారం అరెస్ట్ చేశారు. గతేడాది వెలుగు చూసిన టీటీడీ లడ్డూ కల్తీ వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశం మేరకు 2024 అక్టోబర్‌లో సీబీఐ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం కేసు దర్యాప్తు చేస్తున్నది. అలా అరెస్ట్ చేసిన వారిలో తమిళనాడు నుంచి నెయ్యి సరఫరా చేస్తున్న ఏఆర్ డెయిరీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన పరాగ్ డెయిరీ, ప్రీమియర్ అగ్రీ ఫుడ్స్, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ యాజమాన్యాల ప్రతినిధులు ఉన్నారు. తిరుపతిలో మూడు రోజుల పాటు నిందితులను విచారించామని సీబీఐ అధికారులు చెప్పారు. నెయ్యి కల్తీలో వారి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నా, వారు దర్యాప్తునకు సహకరించడం లేదని తెలిపారు.