అమరావతి : ఏపీలో మరో మరో విద్యార్థి ఆత్మహత్య ( Student Suicide ) చేసుకున్నాడు,. విజయనగరం జిల్లాలోని జేఎన్టీయూ గురజాడ వర్సిటీ విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతుంది. రాత్రి వరకు అందరు విద్యార్థులతో కలిసి మెలసి ఉల్లాసంగా మెలిగిన ఉదయ్ వెంకట తేజ వర్సిటీ వసతిగృహంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వర్సిటీలో ఈఈఈ రెండో సంవత్సరం చదువుతున్న వెంకట తేజ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వర్సిటీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు హాస్టల్‌కు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హాస్టల్ వార్డెన్, సహచర విద్యార్థులతో పోలీసులు వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.