తిరుమలలో భారీ రద్దీ.. ఒక్కరోజే 91వేల మందికి స్వామివారి దర్శనం
ఎండాకాలం సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శనివారం రికార్డు స్థాయిలో 91,005 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
- 16 గంటలు క్యూలోనే..
హైదరాబాద్, మే 3 (నమస్తేతెలంగాణ) : ఎండాకాలం సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శనివారం రికార్డు స్థాయిలో 91,005 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. స్వామివారికి 36,257 మంది తలనీలాలు సమర్పించుకున్నారని, భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం ఒక్కరోజే రూ.3.37 కోట్లుగా నమోదై రికార్డు సృష్టించినట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం భక్తుల రద్దీ మరింత పెరగడంతో సర్వదర్శనం కోసం వేచి ఉండే భక్తుల క్యూలు ఏటీజీహెచ్ ప్రాంతం వరకు కొనసాగుతున్నది.
దర్శన టోకెన్లు లేని సామాన్య భక్తులకు శ్రీవారిని దర్శించుకునేందుకు సుమారు 16 గంటలపైగా సమయం పడుతున్నది. సెలవులు ముగిసే వరకు భారీ రద్దీ కొనసాగే అవకాశం ఉన్నందున, టీటీడీ అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. భక్తులు రద్దీ దృష్ట్యా తమ ప్రయాణాలు సాగించాలని టీటీడీ కోరింది. సెలవుల కారణంగా భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరు గు తున్నదని, సెలువుల అనంతరం సా ధారణ స్థాయికి చేరుకుంటుందని తెలిపింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Protests | సర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో మళ్లీ మొదలైన ఆందోళనలు.. పలువురు అరెస్ట్
Tharun Bhascker | ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా తరుణ్ భాస్కర్ క్రేజీ ఎంటర్టైనర్!
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

