అమరావతి : ఏపీలోని పలు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వైఎస్సార్ జిల్లా వీరనాయుని మండలం ఓబుల్రెడ్డిపల్లె వద్ద ఉన్న వాగుకు ఒక్కసారిగా వచ్చిన వరదతో
చిక్కుకున్న ఇద్దరు గొర్రెల కాపర్లను అధికారులు, పోలీసులు కాపాడారు. గ్రామానికిచెందిన బాల మునీంద్ర యాదవ్, ఆవుల ఎర్రన్న యాదవ్ మేకలు, గొర్రెలను మేతకు తీసుకెళ్లారు.
ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వాగుకు ఒక్కసారిగా వరద రావడంతో వారు వాగులో చిక్కుకున్నారు. చెట్టు కొమ్మలను ఆదారం చేసుకుని అక్కడే ఉండిపోయారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బోటుకు తాళ్లను కట్టి వాగులో చిక్కుకున్న వారి వద్దకు వెళ్లి వారిని స్థానికుల సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.