అమరావతి : ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో ఆదివారంనాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident ) ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. జిల్లాలోని లేపాక్షి మండలం (Lepaksi Mandal) చోళసముద్రం వద్ద మడకశిర నుంచి హిందూపురానికి వెళ్తున్న బ్రహ్మకుమారీల (Brahmakumaris) కారు డివైడర్‌కు ఢీకొని బోల్తా పడింది. దీంతో ఇద్దరు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను హిందూపురం ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.