అమరావతి : ఏపీలో జరుగుతున్న అత్యాచారాలు, హత్యలపై కూటమి ప్రభుత్వం (Alliance government) మౌనం దున్నపోతు మీద వాన పడ్డట్లుందని వైసీపీ అధికార ప్రతినిధి (YCP spokesperson) రాచమల్లు శివప్రసాద్ రెడ్డి (Sivaprasad Reddy) విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు వంద మంది మహిళలు,బాలికలు, చిన్నారులపై దౌర్జన్యాలు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఒక్క సంఘటన జరిగిన రోజే తీవ్రంగా ప్రతిస్పందించినట్లయితే వంద ఘటనలు జరిగేవి కావని ఆరోపించారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాటలకు మాత్రమే పరిమితమయ్యారని విమర్శించారు. ప్రతిరోజు జగన్ను(YS Jagan) దూషించడమే తప్ప, టీడీపీ రాష్ట్రానికి ఎలాంటి మేలు చేయడం లేదని అన్నారు.
ఏపీ హోంమంత్రి శాంతి భద్రతల విషయంలో విఫలమైందని అంగీకరిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్( Pawan Kalyan) పరోక్షంగా ఒప్పుకున్నారని పేర్కొన్నారు. శాంతి భదత్రల్లో విఫలం చెందడం వల్ల ప్రభుత్వం నుంచి వైదొలగాలనిడిమాండ్ చేశారు. పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వకుండా నిందలు వేయడం సబబుకాదని సూచించారు. దిశా చట్టాన్ని అమలు చేసి నేరస్థులకు కఠిన శిక్షలు వేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని కోరారు.