Arasavalli Temple | అరసవల్లిలో ఆదిత్యుని పాదాలు తాకిన సూర్యకిరణాలు
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి దేవాలయంలో (Arasavalli Temple) శ్రీ సూర్యనారాయణ స్వామి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకాయి. లేలేత కిరణాలు పంచద్వారాలను దాటి గాలిగోపురం మధ్య నుంచి ఆదిత్యుని తాకిన దృశ్యాలను చూసి భక్తులు పులకించిపోయారు.
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి దేవాలయంలో (Arasavalli Temple) శ్రీ సూర్యనారాయణ స్వామి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకాయి. లేలేత కిరణాలు పంచద్వారాలను దాటి గాలిగోపురం మధ్య నుంచి ఆదిత్యుని తాకిన దృశ్యాలను చూసి భక్తులు పులకించిపోయారు. ఉదయం 6.05 గంటలకు కొన్ని నిమిషాలపాటు ఆవిష్కృతమైన ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారురు. బుధవారం కూడా స్వామివారి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకే అవకాశం ఉందని పండితులు తెలిపారు. ఏటా రెండు సార్లు ఇలాంటి అద్భుతం ఆవిష్కృతమవుతుంది. ప్రతిఏటా మార్చి 9, 10 తేదీల్లో.. అలాగే అక్టోబర్ నెల 1, 2 తేదీల్లో భక్తులకు కనువిందు చేస్తుంది.
ఆదిత్యుని విగ్రహాంపై పడిన లేలేత కిరణాలు దర్శనమివ్వడంతో జన్మధన్యమైందంటూ భక్తులు సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు. సూర్యకిరణాలు తాకే సమయానికి సూర్యనారాయణమూర్తిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఎప్పటినుంచో ఈ అద్భుతాన్ని చూడాలనుకున్నామని.. ఇప్పుడు ఆ భాగ్యం తమకు దక్కడం సంతోషంగా ఉన్నదని చెప్తున్నారు పలువురు భక్తులు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’కు పైరసీ భయం.. కీలక ఆదేశాలు జారీ చేసిన ముంబై హైకోర్టు!
Glenn Maxwell: అంతర్జాతీయ క్రికెట్‌కు గ్లెన్ మ్యాక్స్‌వెల్ గుడ్‌బై.. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు
Radhika Apte | టాలీవుడ్ కథలపై రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు.. ‘లెజెండ్’ సినిమాను ఉద్దేశించేనా, నెటిజన్ల ఘాటు కౌంటర్లు!
Indian Navy | సముద్ర దొంగల ఆటకట్టించిన ఇండియన్ నేవీ.. ఇరాన్ ఫిషింగ్ షిప్, 20 మంది సిబ్బంది సేఫ్ రిలీజ్..!
Mahesh Babu | గేమింగ్ రంగంలోకి సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ‘టేక్‌డౌన్: జెనెసిస్’తో కొత్త ప్రయాణం!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

