Srikakulam | విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్.. సస్పెండ్
Srikakulam | పిల్లలకు చదువులు చెప్పి బుద్ధిమంతులుగా మార్చాల్సిన ఓ టీచర్ దుర్మార్గంగా వ్యవహరించింది. టీచర్ హాయిగా కుర్చీలో కూర్చొని ఫోన్ మాట్లాడుతూ.. ఇద్దరు విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకుంది.
Srikakulam | పిల్లలకు చదువులు చెప్పి బుద్ధిమంతులుగా మార్చాల్సిన ఓ టీచర్ దుర్మార్గంగా వ్యవహరించింది. టీచర్ హాయిగా కుర్చీలో కూర్చొని ఫోన్ మాట్లాడుతూ.. ఇద్దరు విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకుంది. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆలస్యంగా వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వీడియో తాజాగా బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న వీడియో వైరల్ కావడంతో ఉపాధ్యాయురాలిపై విద్యార్థుల తల్లిదండ్రులు, సామాజికవర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఎంతో గౌరవప్రదమైన, బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి.. విద్యార్థులను ఇలా బానిసలుగా చూస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ క్రమంలో విచారణ జరిపిన ఉన్నతాధికారులు టీచర్ సుజాతను సస్పెండ్ చేశారు. ఈ మేరకు సీతంపేట ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.
చదువు చెప్పకుండా పిల్లలతో కాళ్లు పట్టించుకున్న ఉపాధ్యాయురాలు
శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగు చూసిన ఘటన@naralokesh @PawanKalyan pic.twitter.com/s248TJVG6y
— PRAKASH JANASENA 🇮🇳 (@Jspsaiprakash) November 4, 2025
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Siddugadi Love Story | యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ కట్టిపడేస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. ఘనంగా సక్సెస్ మీట్!
Thiruveer | ‘శ్రీమతి’ నా జీవితంలో ఒక ఎమోషన్.. ఆ టైటిల్ వినగానే నా గతం గుర్తొస్తుంది : తిరువీర్
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

