Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో పరమశివునికి ప్రీతికరమైన కార్తీక మాసంలో శాస్త్రోక్తంగా పూజలు ఘనంగా జరిపిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు చెప్పారు. కార్తీకమాసం రెండవ సోమవారం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంకాలం పుష్కరిణి వద్ద లక్షదీపార్చన, పుష్కరిణికి దశవిధ హారతులను జరిపించినట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి గతేడాది కంటే ఈసారి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పాల్గొన్నారని ఆలయ చైర్మన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వీరన్న, మార్కండేయశర్మ అధికారులు సిబ్బందితోపాటు ధర్మకర్తల మండలి సభ్యులు, ఈఈ రామకృష్ణ, పీఆర్ఓ శ్రీనివాసరావు, శ్రీశైలప్రభ సంపాదకుడు అనీల్‌కుమార్, ఏఆవోలు మోహన్, హరిదాస్, ఆలయ భద్రతాధికారి అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.
1. ఓంకార హారతి : పరబ్రహ్మ స్వరూపమైన బీజాక్షరమే ఓంకారం. ఈ ఓంకార హరతిని దర్శించడం వలన కష్టాలన్నీ నివారించబడి సకలు శుభాలు కలుగుతాయి.
2. నాగ హారతి: నాగ హారతిని దర్శించడం వలన సర్పదోషాలు తొలిగి సంతాన ప్రాప్తి కలుగుతుంది.
3. త్రిశూల హారతి : త్రిశూల హారతిని దర్శించడం వలన అకాల మరణాలు తొలిగి గ్రహ దోషాలు నివారించబడుతాయి.
4. నంది హారతి : నంది హారతిని దర్శించడం వలన భయం దుఖం తొలిగిపోయి ఆనందం నూతనోత్సాహం లభిస్తాయి.
5. సింహ హారతి : సింహ హారతిని దర్శించడం వలన శత్రు భాదలు తొలిగి మనో ధైర్యం పెరుగుతుంది.
6. సూర్య హారతి : సూర్య హారతిని దర్శించడం వలన ఆరోగ్యం చేకూరి దీర్ఘాయుష్షు లభిస్తుంది.
7. చంద్ర హారతి : చంద్ర హరతిని దర్శించడం వలన మనశ్సుద్ది కలిగి ఈర్ష్య అసూయ ద్వేషాలు తొలిగిపోతాయి.
8. కుంభ హారతి : కుంభ హారతిని దర్శించడం వలన కోరుకున్న కోర్కెలు నెరవేరి సంపదలు కలుగుతాయి.
9. నక్షత్ర హారతి : నక్షత్ర హారతిని దర్శించడం వలన జాతక దోషాలు తొలిగి చేపట్టిన పనులలో విజయం లభిస్తుంది.
10. కర్పూర హారతి : కర్పూర హారతిని దర్శించడం వలన పాపాలన్ని తొలిగి యఙ్ఞఫలంతో పాటు అష్ట ఐశ్వర్యాలు సిద్దిస్తాయి.