తిరుమల : నిత్యం గోవిందానామస్మరణతో మారుమ్రోగే తిరుమలలో (Tirumala) వచ్చేనెలలో జరుగబోయే విశేష పర్వదినాలను (Special festivals ) అధికారులు ప్రకటించారు. డిసెంబర్ 1న శ్రీవారి ఆలయంలో 4వ విడత అధర్వణ వేదపారాయణం ప్రారంభం అవుతుందని, 11న సర్వ ఏకాదశి, 12న చక్రతీర్థ ముక్కోటి కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు.
13న తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర, 14న తిరుప్పాణాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, 15న శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం, 16న ధనుర్మాసారంభం, 26న సర్వ ఏకాదశి, 29న మాస శివరాత్రి, తొండరడిప్పొడియాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, 30న అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.75 కోట్లు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న స్వామివారిని 67,626 మంది భక్తులు దర్శించుకోగా 22,231 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల మొక్కుల ద్వారా హుండీకి రూ. 3.75 కోట్ల ఆదాయం(Hundi Income) వచ్చిందని టీటీడీ అధికారులు ప్రకటించారు.