కొన్ని ప్రత్యేక రైళ్లు రద్దు.. కొన్ని కొత్త రైళ్లు ఏర్పాటు
కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. అయితే, పరిస్థితి సాధారణ స్థితికి రావడంతో వాటిలో కొన్నింటిని రద్దు...
విశాఖపట్నం: కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. అయితే, పరిస్థితి సాధారణ స్థితికి రావడంతో వాటిలో కొన్నింటిని రద్దు చేశారు. మరికొన్ని ప్రత్యేక రైళ్లను యధావిధిగా నడుపుతున్నారు.
జూలై 14 నుంచి విశాఖపట్నం-రాయగడ (18528), విశాఖపట్నం-పలాస (18532), విశాఖపట్నం-కిరండోల్ (18551) , జూలై 15 నుంచి రాయగడ-విశాఖపట్నం (18527), పలాస-విశాఖపట్నం (18531, కిరండోల్-విశాఖపట్నం (18552) వంటి కొన్ని ప్రత్యేక రైళ్లు రద్దయ్యాయి. అయితే ఈస్ట్ కోస్ట్ రైల్వే రెగ్యులర్ ప్యాసింజర్ రైళ్ల స్థానంలో ప్యాసింజర్ ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. విశాఖపట్నం-రాయగడ ప్యాసింజర్ స్పెషల్ (08504) జూలై 15 నుంచి విశాఖపట్నంలో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి రాత్రి 10.05 గంటలకు రాయగడ చేరుకుంటుంది. ప్రతిగా రాయగడ-విశాఖపట్నం ప్యాసింజర్ (08503) జూలై 16 నుంచి ఉదయం 5.40 గంటలకు రాయగడలో బయలుదేరి ఉదయం 10 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని రైల్వే శాఖ తెలిపింది.
విశాఖపట్నం-పలాస ప్యాసింజర్ (08532) జూలై 15 నుంచి విశాఖపట్నంలో సాయంత్రం 5.45 గంటలకు బయలుదేరి రాత్రి 10 గంటలకు పలాస చేరుకుంటుంది. ప్రతిగా పలాస – విశాఖపట్నం ప్యాసింజర్ (08531) జూలై 16 నుంచి ఉదయం 5 గంటలకు పలాసలో బయలుదేరి ఉదయం 9.25 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖపట్నం-కిరండోల్ ప్యాసింజర్ (08551) రైలు జూలై 15 నుంచి విశాఖపట్నంలో ఉదయం 6.45 గంటలకు బయలుదేరి రాత్రి 8.45 గంటలకు కిరండోల్ చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో కిరండోల్-విశాఖపట్నం ప్యాసింజర్ (08552) రైలు జూలై 16 నుంచి ఉదయం 6 గంటలకు కిరండోల్‌లో బయల్దేరి రాత్రి 8.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

