హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మంగళవారం సంచలన నిర్ణయం తీసుకున్నది. సిట్ దర్యాప్తును తాతాలికంగా నిలిపివేస్తున్నట్టు డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు.
దీక్ష కేవలం లడ్డూ కోసమే కాదు..
ప్రాయశ్చిత్త దీక్ష లడ్డూ కోసమే కాదని, శాశ్వత పరిష్కారం కోసం చేపట్టానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. దీక్ష విరమణ కోసం తిరుమలకు బయల్దేరిన ఆయన మంగళవా రం మీడియాతో మాట్లాడారు. కాగా, ‘కొత్త భక్తుడికి పంగనామాలెకువ!.. కదా?.. ఇక చాలు.. ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి’ అంటూ నటుడు ప్రకాశ్‌రాజ్ సెటైర్ వేశారు.