CID investigation | ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. మద్యం అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశం
CID investigation | వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై ఏపీ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది.
అమరావతి : వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై ఏపీ ప్రభుత్వం సీఐడీ విచారణకు (CID investigation) ఆదేశించింది. లోతైన విచారణ తరువాత ఈ అంశాన్ని ఈడీ(ED) కి సిఫార్సు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandra babu) ప్రకటించారు. బుధవారం ఏపీ అసెంబ్లీ (Assembly) సమావేశాల మూడో రోజున మద్యం అక్రమాలపై చంద్రబాబు శ్వేత పత్రాన్ని (White papar) విడుదల చేశారు.
ఈ సందర్భంగా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో మద్యం అక్రమాలపై అసెంబ్లీలో ప్రజంటేషన్ ద్వారా వివరించారు. మద్యం ధరలు పెంచి వచ్చిన వేలాది కోట్ల రూపాయాల సొమ్మును వైసీపీ నేతలు దోచుకుతిన్నారని ఆరోపించారు. పేదవాడి బలహీనతను ఆసరగా చేసుకుని నాణ్యత లేని లోకల్ బ్రాండ్లు తీసుకొచ్చి విచ్చలవిడిగా విక్రయించారని, దీని వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యారని పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో ఎక్సైజ్ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని, సరైన పాలసీలు తీసుకొచ్చి పేదలకు అందుబాటులో మద్యం లభించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. అంతకు ముందు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్( Pawan Kalyan) మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో మద్యం అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మద్యం ద్వారా రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో మద్యానికి బానిసలైన వారి కోసండీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటుకు 10 శాతం కేటాయించాలని సూచించారు. అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి వస్తుందన్న భయంతో వైసీపీ నాయకులు సమావేశం నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

