Nara Lokesh | రెడ్‌బుక్ అమలు స్టార్ట్ అయ్యింది.. ఏపీ మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh | ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే రెడ్‌బుక్ అమలు ప్రారంభమైందని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి శిక్ష తప్పదని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. చట్టాన్ని అతిక్రమించిన ఎవరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు.
Nara Lokesh | ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే రెడ్‌బుక్ అమలు ప్రారంభమైందని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి శిక్ష తప్పదని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. చట్టాన్ని అతిక్రమించిన ఎవరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు. శ్రీకాకుళం పర్యటనలో భాగంగా నారా లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ.. రైట్ ప్లేస్‌లో రైట్ పర్సన్ ఉండాలన్నదే తమ కూటమి ప్రభుత్వ అభిమతమని పేర్కొన్నారు.
సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇప్పటికే పింఛన్లు, మెగా డీఎస్సీ హామీలు అమలు చేశామని నారా లోకేశ్ తెలిపారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు. పథకాల అమలుపై తమకు చిత్తశుద్ధి ఉందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని తెలిపారు. జగన్‌లా తాము పారిపోయే వ్యక్తులం కాదని వ్యాఖ్యానించారు.
తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై కూడా నారా లోకేశ్ స్పందించారు. మనం ఏ మతానికి చెందిన వారమైనా అన్ని మతాలను గౌరవించాలని అన్నారు. తాము చర్చి, మసీదులకు వెళ్లినప్పుడు వారి మత విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకుంటామని తెలిపారు. తిరుమలకు వెళ్తా అంటున్న జగన్ కూడా డిక్లరేషన్ ఇచ్చి సంప్రదాయాన్ని పాటిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు తాను నిర్వహించిన యువగళం పాదయాత్రలో కూడా తిరుమల లడ్డూ నాణ్యత లోపంతో పాటు ఇతర సమస్యలు తన దృష్టికి వచ్చాయని లోకేశ్ అన్నారు. అందుకే అధికారంలోకి రాగానే టీటీడీని ప్రక్షాళన చేయాలని ఈవోకు చెప్పామని తెలిపారు. తిరుమలలో జరిగిన అవకతవకలను నిగ్గు తేల్చేందుకు కమిటీ వేశామని చెప్పారు. విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

